Xiaomi Redmi Y1 మరియు Y1 Lite ఈరోజే మీ సొంతం….
By
Santhoshi |
Updated on 06-Dec-2017
కంపెనీ Xiaomi Redmi Y1 మరియు Xiaomi Redmi Y1 లైట్ లను భారతదేశం లో కేవలం కొన్ని నెలల క్రితం పరిచయం చేసింది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు, ఈ రెండు ఫోన్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
Survey✅ Thank you for completing the survey!
Xiaomi Redmi Y1 రెండు వేరియంట్లలో లభిస్తుంది – 64GB మరియు 32GB, అదే Xiaomi Redmi Y1 లైట్ ఒకే వేరియంట్ తో వస్తుంది మరియు దాని ధర రూ. 6.999 ఉంది. Xiaomi Redmi Y1 64Gb వేరియంట్ రూ. 10,999, దాని 32GB వేరియంట్ రూ. 8.999 ఉంది. ఫోన్లు రెండు ప్లాస్టిక్ బిల్డ్ కలిగి, టాప్ మెటల్ ఫినిషింగ్ తో వస్తాయి . క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 SoC ద్వారా Xiaomi Redmi Y1 పని చేస్తుంది . ఇది 3GB RAM / 32 GB స్టోరేజ్ మరియు 4GB RAM / 64 GB స్టోరేజ్ లలో 2 వేరియంట్లలో ఉంటుంది.