Xiaomi Redmi Y1 అండ్ Xiaomi Redmi Y1 Lite సేల్స్ నేడే , ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు

Updated on 08-Nov-2017

Xiaomi Redmi Y1  అండ్ Xiaomi Redmi Y1 Lite సేల్స్  నేడే , ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో ఈ సేల్ మొదలవ్వనుంది భారతీయ మార్కెట్లో షియోమీ  ఇటీవలే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది, Xiaomi Redmi Y1 మరియు Xiaomi Redmi Y1 Lite. కంపెనీ Xiaomi Redmi Y1 యొక్క రెండు వేరియంట్లను పరిచయం చేసింది, ఒక 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్  తో వస్తుంది, దీని ధర రూ. 8,999, 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 10.999

Xiaomi Redmi Y1 లైట్  ధర గురించి మాట్లాడినట్లయితే దాని ధర రూ. 6,999 . Xiaomi రెడ్మి Y1 లైట్ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 SOC కలిగి వుంది , ఇది మొదట Xiaomi Redmi 4A లో ఉపయోగించబడింది. 7000 బడ్జెట్  లో పెద్ద స్క్రీన్ తో ఏ ఫోన్  లేదు మరియు Redmi Y1 లైట్ ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రవేశపెట్టబడింది, ఫోన్ 5.5 అంగుళాల 720p డిస్ప్లే ను  కలిగి వుంది .  ఈ ఫోన్లో 2GB RAM మరియు 16GB స్టోరేజ్ ఉంది. ఇది 128GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్ పాండబుల్ . ఈ డివైస్  13MP వెనుక కెమెరా మరియు 3080mAh బ్యాటరీ కలిగి ఉంది.

Xiaomi Redmi Y1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 SOC కలిగి వుంది , ఇది గతంలో Redmi 4 లో చూసాము .  ఇది 3GB RAM / 32 GB స్టోరేజ్ మరియు 4GB RAM / 64 GB స్టోరేజ్  2 వేరియంట్లలో ఉంటుంది.వీటి  ధర రూ .8,999, రూ .10,999. ఆన్-బోర్డు స్టోరేజ్ తో పాటు, మీరు 128GB స్టోరేజ్  మద్దతు కోసం మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ పొందుతారు.
బ్యాటరీ 3080mAh, ఈ ఫోన్ యొక్క ప్రత్యేక లక్షణం దాని 16MP ముందు కెమెరా, వెనుక కెమెరా PDAF మరియు HDR మద్దతుతో 13MP ఉంది.
ఫోన్లు రెండు ప్లాస్టిక్ బిల్డ్ కలిగి, టాప్ లో  మెటల్ ఫినిషింగ్ తో వున్నాయి . Xiaomi Redmi Y1 మరియు Y1 లైట్ గ్రే  మరియు గోల్డ్ కలర్స్ లో  అందుబాటులో వున్నాయి .

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :