Apple Budget iPhone కోసం చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్ .. పాత ఫోన్ రేటు పెరిగింది.!

HIGHLIGHTS

Apple Budget iPhone కోసం చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్

ఐఫోన్ 18 సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ వస్తుందని ఎదురు చూసిన వారికి చుక్కెదురు

కొత్త ఫోన్ లాంచ్ చేయకపోగా గత సిరీస్ బడ్జెట్ ఫోన్ రేట్లు కూడా భారీగా పెంచేసింది

Apple Budget iPhone కోసం చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. యాపిల్ బిగ్ ఈవెంట్ నుంచి ఐఫోన్ 18 సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ వస్తుందని ఎదురు చూసిన వారికి చుక్కెదురయింది. యాపిల్ 18 సిరీస్ నుంచి కేవలం ఐఫోన్ 18 ప్రో మరియు ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్లు మాత్రమే విడుదల చేసింది. రెగ్యులర్ గా విడుదల చేసే బేసిక్ వేరియంట్ ను ఈసారి దాటవేసింది. నిజానికి ఇది కూడా అంత పెద్ద బ్యాడ్ న్యూస్ కాదు. యాపిల్ ఈవెంట్ 2026 నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేయకపోగా, గత సిరీస్ బడ్జెట్ ఫోన్ రేట్లు కూడా భారీగా పెంచేసింది. ఇది నిజంగా యాపిల్ ఐఫోన్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్ అవుతుంది.

Apple Budget iPhone

సెప్టెంబర్ నెలలో యాపిల్ నిర్వహించే అతిపెద్ద లాంచ్ ఈవెంట్ ను భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10:30 గంటలకు కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించింది. ఈ ఈవెంట్ నుంచి ఐఫోన్ 18 సిరీస్ నుంచి ప్రో మరియు ప్రో మాక్స్ వేరియంట్ లతో పాటు ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డుయో ని కూడా విడుదల చేసింది. అయితే, ఈ సిరీస్ లో బేసిక్ వేరియంట్ అయిన ఐఫోన్ 17 ని లాంచ్ చేయలేదు.

అంతేకాదు, ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు’ సామెత మాదిరిగా గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ రేట్లు కూడా పెంచేసింది. దీనితో కొత్త ఫోన్ రాకతో పాత రేటు తగ్గుతుంది, అని ఎదురు చూసిన యాపిల్ ఐఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ ప్రేమికులు అవాక్కయ్యారు.

Also Read: Apple iPhone 18 Series తో పాటు పాడ్స్ 5 మరియు ఫోల్డబుల్ ఫోన్ ఇండియా ప్రైస్ లిస్ట్ ఇదిగో.!

ఐఫోన్ 17 సిరీస్ కొత్త రేట్లు

ఇక యాపిల్ కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 17 సిరీస్ కొత్త రేట్లు చూస్తే ఐఫోన్ కొనాలనే ఆశ నీరుగారిపోతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ధరలో ఏకంగా ఒక లకారానికి చేరుకోవడమే ఇందుకు కారణం. యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ మాత్రమే కాదు ఐఫోన్ 16, ఎయిర్ పాడ్స్ మరియు యాపిల్ వాచ్ రేట్లు కూడా పెంచేసింది. యాపిల్ నిర్ణయించిన కొత్త రేట్లు మరియు వాటి లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.

Device and variantOld priceNew pricePercentage
ఐఫోన్ 17 (256GB)Rs 82,900Rs 99,90020.51%
ఐఫోన్ 17 (512GB)Rs 1,02,900Rs 1,24,90021.38%
ఐఫోన్ 17e (256GB)Rs 64,900Rs 79,90023.11%
ఐఫోన్ 17e (512GB)Rs 84,900Rs 1,04,90023.56%
ఐఫోన్ ఎయిర్(256GB)Rs 1,19,900Rs 1,49,90025.02%
ఐఫోన్ ఎయిర్(512GB)Rs 1,39,900Rs 1,74,90025.02%
ఐఫోన్ ఎయిర్(1TB)Rs 1,59,900Rs 2,24,90040.65%
ఐఫోన్ 16  (128GB)Rs 79,900Rs 89,90012.52%
ఎయిర్ పాడ్స్ ప్రో 3Rs 25,900Rs 27,9007.72%
ఎయిర్ పాడ్స్ మాక్స్ 2Rs 67,900Rs 74,90010.31%
యాపిల్ వాచ్ SE 3Rs 25,900Rs 29,90015.44%

ఇప్పటి వరకు కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు మాత్రమే రేటు పెరుగుతున్నాయని, ఐఫోన్ ఫోన్ రేట్లు ఇప్పుడప్పుడే పెరగవని ఆశాభావం వ్యక్తం చేసిన వారికి ఈ కొత్త రేట్లు చూస్తే ఆ భావన పూర్తిగా మాయం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :