షియోమీ రెడీమి నోట్ 5 ప్రో ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మరియు మీ.కామ్ ద్వారా ఓపెన్ సేల్ లో అందుబాటులో వుంది

షియోమీ రెడీమి నోట్ 5 ప్రో ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మరియు మీ.కామ్ ద్వారా ఓపెన్ సేల్ లో అందుబాటులో వుంది
HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ స్టాక్ లేని కారణంగా షియోమీ రెడీమి నోట్ 5 6జీబీ వేరియెంట్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. 4జీబీ వేరియెంట్ మాత్రం నో కాస్ట్ EMI ఆఫర్ తో అందుబాటులో వుంది.

మీరు షియోమీ రెడీమి నోట్ 5 ప్రో ని చేతుకి  అందిపుచ్చుకోవడానికి పోరాడుతున్న వారిలో మీరు కూడా ఉంటే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. ఇ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు షియోమీ యొక్క సొంత ఆన్లైన్ షాప్, Mi.com పై ఓపెన్ అమ్మకం ద్వారా ఈ స్మార్ట్ ఫోన్  అందుబాటులో ఉంది. ఓపెన్ అమ్మకానికి ముఖ్యంగా ఆరు నెలల క్రితం డివైజ్ యొక్క ఆవిష్కరణ నుండి కొనసాగుతున్న ఫ్లాష్ అమ్మకాలు ముగియనున్నాయి.  షియోమీ రెడీమి నోట్ 5 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది: 4జీబీ ర్యామ్/ 64జీబీ  స్టోరేజీ వేరియంట్ రూ .14,999 మరియు ఒక 6జీబీ ర్యామ్/ 64జీబీ మోడల్ 16,999 ధరకే లభిస్తుంది. 

ఫ్లిప్ కార్ట్ లో 6జీబీ వేరియంట్ లభ్యత గురించి చుస్తే , ఇది అధిక డిమాండ్ ఉంది మరియు ఇప్పటికే దీని స్టాక్ అయిపోయింది. రెడీమి నోట్ 5 ప్రో యొక్క 4జీబీ  వేరియంట్ ఇప్పటికీ గట్టిగా  మార్కెట్ ని  అందిపుచ్చుకొని ఉంది. రెడీమి నోట్ 5 ప్రో ఫిబ్రవరిలో ప్రారంభించబడింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 చిప్ సెట్ శక్తినిచ్చేది మరియు ఫేస్ అన్లాక్ కి మద్దతు ఇచ్చే మొట్టమొదటి షియోమీ స్మార్ట్ ఫోన్. ఈ డివైజ్ ఒక 5.99 అంగుళాల ఫుల్ హెచ్ డి+ 18: 9 యాస్పెక్ట్ రేషియోతో పాటు 2160 x 1080p రిజల్యూషన్ ని కలిగి ఉంది. కెమెరా విభాగంలో, రెడీమి నోట్ 5 ప్రో వెనుక భాగంలో 12ఎంపీ (f / 2.2 ఎపర్చరు) + 5ఎంపీ (f / 2.0 ఎపర్చర్) డ్యూయల్ – బ్యాక్  కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇది సెల్ఫీ – లైట్  మరియు బ్యూటీ 4.0 ఫీచర్ తో 20ఎంపీ ముందు షూటర్ను కలిగి ఉంది. ఫోన్ వెనుకవైపు ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది మరియు ఇది 4000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

షియోమీ ఇటీవల దేశంలో మీ  ఏ 2 (రివ్యూ) ను ప్రారంభించింది. మీ ఏ 2 యొక్క 4జీబీ  ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .16,999 గా ఉంటుంది మరియు షియోమీ యొక్క భారతదేశ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్, త్వరలో భారతదేశం లో 6జీబీ  ర్యామ్ + 128జీబీ  స్టోరేజ్ వేరియంట్ విడుదలని చేయనున్నట్లు  ప్రకటించారు. షియోమీ మీ  ఏ 2 ఆగష్టు 16 నుంచి Amazon.in, Mi.com, మి హోమ్ మరియు మి ప్రిఫర్డ్  పార్టనర్ స్టోర్స్ లో అమ్మకానికి అందనున్నది. మి యొక్క ఏ 2 స్పోర్ట్స్ ఒక యాస్పెక్ట్ రేషియో 18: 9 తో 5.99 అంగుళాల పూర్తి హెచ్ డి + డిస్ప్లే కలిగివుంది. ఇది ఒక ఆక్టా  కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  660 చిప్సెట్ చేత శక్తినివ్వబడింది మరియు గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమం కింద ప్రారంభించబడింది. వేలిముద్ర సెన్సార్ మరియు నిలువుగా అమర్చిన 12ఎంపీ  + 20ఎంపీ  డ్యూయల్ – కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉన్నాయి. షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీతో 20ఎంపీ ముందు కెమెరా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo