ఇండియాలో పోకో ఎఫ్1 యొక్క మొదటి సేల్ ఈ రోజు 12 PM నుండి మొదలు : ఫోన్ అందుబాటు, ధరలు స్పెక్స్ మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 Aug 2018
HIGHLIGHTS
  • ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎఫ్1 ఫ్లిప్ కార్ట్ మరియు షియోమీ ఆన్లైన్ స్టోర్ల ద్వారా అమ్మకానికి ఉండనుంది ఇండియాలో.

ఇండియాలో పోకో ఎఫ్1 యొక్క మొదటి సేల్ ఈ రోజు 12 PM నుండి మొదలు : ఫోన్ అందుబాటు, ధరలు స్పెక్స్ మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం

ఈ షియోమీ ఉప బ్రాండ్ అయిన పోకో ఫోన్ ఎఫ్1 స్మార్ట్ ఫోన్ మిగతా ఏ ఇతర స్మార్ట్ ఫోన్లు కూడా ఇంత తక్కువ ధరలో ఇవ్వని అద్భుతమైన ఫీచర్స్ ని తీసుకు వస్తుంది. ఇందులో ముఖ్యంగా దీని ప్రాసెసర్ గురించి చుస్తే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 Soc ని అందించారు ఇప్పటి వరకు ఇది హై ఎండ్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే అందుబాటులోవుంది . అయితే ఇప్పుడు మిడ్ - రేంజ్ ఫోన్లలో కేవలం పోకో ఫోన్ ఎఫ్ 1 లో మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది.

షియోమీ పోకో ఫోన్ ఎఫ్1 (లేదా) పోకో ఎఫ్1 : ధరలు మరియు ఆఫర్లు     

కొన్ని రోజుల క్రితమే షియోమీ ఈ పోకో ఫోన్ ఎఫ్ 1 ని విడుదల చేసింది. షియోమీ ఈ పోకో ఎఫ్ 1  బేస్ వేరియంట్ అయిన 6జీబీ ర్యామ్ మరియు 64 జీబీ అంతర్గత స్టోరేజిగల ఈ వేరియంట్ ని రూ . 21,999 ధర గా ప్రకటించింది. మరొక 6జీబీ ర్యామ్ మరియు 128జీబీ అంతర్గత స్టోరేజిగల  వేరియంట్ ని   రూ . 24,999 ధరతో వుంది. ఈ రెండింటి కంటే హై వేరియెంట్ ని 8జీబీ ర్యామ్ మరియు 256జీబీ అంతర్గత స్టోరేజితో  రూ . 31,999 ధర వద్ద అందిస్తుంది . ఈ మూడు వేరియంట్లు కూడా క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 SoC ప్రాసెసర్ తో పనిచేస్తాయి.  ఈ స్మోర్ట్ ఫోన్లు స్టీల్ బ్లూ , రోజ్ రెడ్ , గ్రాఫైట్ బ్లాక్ మరియు స్పెషల్ అర్మౌర్డ్ ఎడిషన్ టెక్షర్ బ్లాక్ అప్పియరెన్స్ తో వాస్తాయి.

అయితే ఈ రోజు అమ్మకాన్ని కోసం షియోమీ  అఫర్ గా 6జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజి వేరియెంట్ ని  రూ . 20,999 ధరతో అందిస్తుంది. ఇంకా 6జీబీ/128జీబీ వేరియంట్ ని  రూ . 23,999 మరియు స్పెషల్  అర్మౌర్డ్ ఎడిషన్ 8జీబీ/256జీబీ వేరియెంట్ ని రూ . 28,999 ధరతో అందిస్తుంది. దీనికి అదనంగా ఫ్లిప్ కార్ట్ లో బజాజ్ ఫిన్ సర్వ్ మరియు HDFC బ్యాంకు ద్వారా రూ . 2,334 ల నో కాస్ట్ EMI తో అందించబడుతుంది. అలాగే ఇంకా Axis బ్యాంకు బజ్ క్రేడిట్ కార్డు వినియుగధారులకు 5% తగ్గింపు లభిస్తుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు చెల్లింపు ద్వారా అదనంగా రూ . 1000 ల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

పోకోఎఫ్1 స్పెసిఫికేషన్స్

ఈ పోకో ఎఫ్1 క్వాల్కమ్ 845 ఆక్టా కోర్ ప్రాసెస్ శక్తితో పనిచేస్తుంది. పైన తెలిపిన విధంగా, ఇందులో కాపర్ పైపు ద్వారా ఒక లిక్విడ్ కూల్ టెక్నాలజీ అందించబడింది దీనితో వినియోగదారులు అత్యధికంగా ఫోన్ ని వాడే సమయాలలో కూడా CPU ని చల్లగా ఉండే విధంగా చూస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 19:9 రిజల్యూషన్ గల ఒక 6.18 - అంగుళాల ఫుల్ హెచ్ డి+ IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. గొరిల్లా గ్లాస్ తో సురక్షితం చేయబడిన వైడ్ నోచ్ డిస్ప్లే దీనికి అందించారు, ఎందుకంటె ఇందులో  IR లెన్స్ తో చీకటిలో కూడా పేస్ అన్లాక్ ని అందించే విధంగా ఇచ్చారు. ఈ నోచ్ లైటింగ్ సెన్సార్, ఇయర్ పీస్,ఒక 20ఎంపీ సెన్సర్ని ఆఇందులో ఇనుమడించుకొని ఉంది. ఇరుప్రక్కల వున్న బెజెల్స్ సామాన్యంగా ఉన్నాయి మరియు దీని క్రింది భాగం లో ఒక మందపాటి చిన్ ని ఇచ్చారు. కంపెనీ ఇందులో గ్లాస్ బ్యాక్ కాకుండా లేయర్ కలర్ ప్రాసెస్ చేసి మందంగా కోట్ చేయబడిన పోలీకార్బోనేట్ యూనిబాడీని అందించారు. ఈ విధానం వలన ఫోన్ చేతిలో చక్కని గ్రిప్ తో ఇమిడి పోతుంది.

 ముందు చెప్పినట్లుగా, పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్  6జీబీ  DDR4 ర్యామ్ + 64జీబీ UFS 2.1 స్టోరేజి , 6జీబీ DDR4 ర్యామ్ + 128జీబీ UFS 2.1 స్టోరేజి మరియు 8జీబీ DDR4 ర్యామ్ + 256జీబీ UFS 2.1 స్టోరేజిలను అందిస్తుంది. కొనుగోలుదారులు ఒక హైబ్రిడ్ స్లాట్ ద్వారా మెమరీని 256జీబీ వరకు విస్తరించడానికి ఒక ఎంపికను కలిగి ఉంటుంది. ఇంకా, ఈ ఫోన్లో 4,000 mAh బ్యాటరీ ఉంది, ఇది USB టైప్ సి పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో త్వరిత ఛార్జ్ 3.0 టెక్నాలజీ మరియు  స్పీడ్ ఛార్జర్ బాక్స్ తో పాటు వస్తుంది. షియోమీ తెలిపిన ప్రకారం 8 గంటల వరకు గేమింగ్ ని ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వగలదు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే,ఈ పోకో ఎఫ్1 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది: ప్రాధమిక కెమెరా 12ఎంపీ సోనీ IMX 363 లెన్స్ f / 1.8 ఎపర్చర్, డ్యూయల్ పిక్సెల్ PDAF టెక్నాలజీ, రియల్ టైం AI ఫోటోగ్రఫి 25 రకాల సీన్ రికగ్నైజేషన్, AI బ్యాక్లైట్ డిటెక్షన్, పోర్ట్రైట్ మోడ్ మరియు HDR లో 209 సీన్స్ వరకు గుర్తించే విధంగా ఉంటుంది. ద్వితీయ కెమెరా 5ఎంపీ సెన్సార్ ని కలిగి ఉంది.  షియోమీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) లక్షణాన్ని దాటవేయడానికి ఎంచుకున్నారు. ముందు, పిక్సెల్ బినింగ్ టెక్నాలజీ, పోర్త్రైట్ మోడ్ మరియు HDR తో 20ఎంపీ లెన్స్ ఉంది. పరిసర ప్రభావం కోసం రెండు స్పీకర్లు ఉన్నాయి. ఒక క్రింద ఉంటుంది, మరొకటి ఇయర్పీస్ లో ఉంటుంది. ఈ రెండు స్పీకర్లు డిరెక్ హెచ్ డి సౌండ్ గల ఒక డ్యూయల్ స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్ ని కలిగివున్నాయి.

logo
Raja Pullagura

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status