Xiaomi నుండి Mi note 2 వస్తుంది. అఫీషియల్ లాంచ్ డేట్ అనౌన్స్

Updated on 04-Nov-2016

Xiaomi మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది. అయితే ఇది చైనా లో లాంచ్ అవనుంది. లాంచ్ డేట్ ను కూడా కన్ఫర్మ్ చేసింది కంపెని.

అక్టోబర్ 25 న Mi Note 2 పేరుతో వస్తుంది కొత్త స్మార్ట్ ఫోన్. Weibo కంపెని అకౌంట్ ద్వారా అఫీషియల్ అనౌన్సుమెంటు జరిగింది. ఇది కంపెని నుండి మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోకీ కాస్ట్లీ ఫోన్ అని అంచనా.

దీనిలో డ్యూయల్ edge స్క్రీన్ ఉంటుంది అని ఒక వైపు వినిపిస్తుంది, మరో వైపు బెజేల్ లెస్ డిస్ప్లే(పైన ఉన్న ఇమేజ్ ను close గా చూడండి) ఉంటుంది అని రిపోర్ట్స్. రెండింటిలో ఏది నిజమైనా అది పెద్ద విషయమే అని చెప్పాలి.

ఇతర రూమర్ స్పెక్స్ విషయానికి వస్తే, 5.7 in డిస్ప్లే, స్నాప్ద్ డ్రాగన్ 821 SoC, 6GB రామ్, 16MP డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ ఉండనున్నాయి.

గత నెలలో కంపెని Mi 5S అండ్ Mi 5S ప్లస్ మోడల్స్ ను కూడా లాంచ్ చేసింది చైనా లో. వీటిలో స్నాప్ డ్రాగన్ 821 SoC, 3GB/4GB రామ్ – 64GB/128GB స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. ప్లస్ మోడల్ లో డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :