Xiaomi Mi 6 Lite లైట్ వేరియంట్ స్నాప్ డ్రాగన్ 660 ప్రోసెసర్ తో అతిత్వరలో లాంచ్

HIGHLIGHTS

ఇది రెండు వేరియంట్లుగా లాంచ్ చేయబడింది

Xiaomi Mi 6 Lite  లైట్  వేరియంట్  స్నాప్ డ్రాగన్ 660  ప్రోసెసర్  తో అతిత్వరలో  లాంచ్

 షియోమీ  గత  నెలలో  చైనా  లో Xiaomi Mi 6 ని లాంచ్ చేసింది.  ఇది రెండు  వేరియంట్లుగా  లాంచ్  చేయబడింది .  స్టాండర్డ్  ఎడిషన్  లో   గ్లాస్  బాడీ  కలదు.   మరియు  రెండవది  సిరామిక్  అడిషన్ .  వచ్చిన  పుకార్ల ప్రకారం   కంపెనీ  త్వరలో దీని  లైట్  వేరియంట్  కూడా  ప్రవేశపెట్టబోతుంది.దీని  కొత్త వేరియంట్  పేరు Mi 6 Youth Editon లేదా  Mi 6 Lite Edition  అవ్వొచ్చు .  మరియు   దీనిలో స్నాప్  డ్రాగన్  660  ప్రోసెసర్  ఉండొచ్చు . Xiaomi Mi 6 Lite వేరియంట్  ధర  1999 Yuan  ఇండియన్  కరెన్సీ  ప్రకారం  Rs. 18,597  ఉంటుంటుంది.  ఇది  జూన్  మొదటి  వారం లో  రిలీజ్  అవ్వనుంది. .
రూమర్స్  ప్రకారం ఈ కొత్త  వేరియంట్  లో కూడా  Xiaomi Mi 6  లాంటి  స్పెక్స్ కలవు .  కొత్త  లైట్  వేరియంట్ లో స్నాప్ డ్రాగన్ 660  చిప్సెట్  ఉంటుంది.
Xiaomi Mi 6 లో 5.15- ఇంచెస్  ఫుల్ 1080p డిస్ప్లే  గలదు .  దీనిలో  ఫ్రంట్  మరియు బ్యాక్  న  గ్లాస్  ఉపయోగించారు.  క్వాల్  కాం  స్నాప్డ్రాగన్  835 64- బిట్  ఆక్టో  కోర్  ప్రోసెసర్  గలదు. దీని క్వాల్క్  స్పీడ్  1.45GHz  మరియు దీనిలో  అడ్రినో 540 GPU . మరియు  6GB  RAM  తో  64GB/128GB  స్టోరేజ్  ఆప్షన్స్  కూడా  కలవు. ఆండ్రాయిడ్  7.1.1 nougat ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది. 3350mAh  బ్యాటరీ  కలదు. డ్యూయల్  కెమెరా  గలదు . రెండు  కెమెరాలు   12 ఎంపీ  8  ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo