Xiaomi కొత్త ఫోన్ Mi 5C ఇమేజెస్ & స్పెక్స్ లీక్
By
Karthekayan Iyer |
Updated on 29-Nov-2016
Xiaomi మరొక కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేయనుంది అని లేటెస్ట్ అప్ డేట్. ఫోన్ పేరు Mi 5C అని తెలుస్తుంది. దీనిలో మొట్టమొదటిసారిగా కంపెని సొంతంగా తయారు చేసిన Pinecone ప్రొసెసర్ ఉంటుంది అని రిపోర్ట్స్.
Survey✅ Thank you for completing the survey!
చైనాలో డిసెంబర్ 6 న రిలీజ్ అవుతుంది అని లేటెస్ట్ గా Weibo చైనీస్ సోషల్ మీడియా వెబ్ సైట్ ద్వారా తెలుస్తుంది. గతంలో కూడా ఫోన్ geekbench లిస్టింగ్ లో లీక్ అయ్యింది.
సో దాని ప్రకారం ఫోన్ లో 3GB రామ్, 64GB స్టోరేజ్, ఆక్టో కోర్ 1.4GHz ప్రొసెసర్, MIUI 8 based ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS ఉండనున్నాయి.
గతంలో 2015 సెప్టెంబర్ లో కంపెని Mi 4C పేరుతో అప్పటి ఫ్లాగ్ షిప్ మోడల్ కు కొంచెం తక్కువ స్పెక్స్ తో ఫోన్ రిలీజ్ చేసింది. సో ఇది కూడా అదే తరహా మిడ్ ఫ్లాగ్ షిప్ స్పెక్స్ తో ఉంటాయి అని అంచనా.