Xiaomi Mi 11: స్నాప్ డ్రాగన్ 888 ప్రొసెసర్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్

Xiaomi Mi 11: స్నాప్ డ్రాగన్ 888 ప్రొసెసర్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

Xiaomi Mi 11 స్నాప్ డ్రాగన్ 888 ప్రొసెసర్ తో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ లాంచ్

Mi ఫోన్ 11 2K AMOLED స్క్రీన్ తో సహా గొప్ప ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.

సరికొత్త Gorilla Glass Victus తో వస్తుంది.

షియోమి మరొకసారి తన సత్తా నిరూపించుకుంది. లేటెస్ట్ గా క్వాల్కామ్ ప్రకటించిన అత్యంత వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 888 ప్రొసెసర్ తో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి, షావోమి తన సత్తా చాటుకుంది.  స్నాప్ డ్రాగన్ 888 ప్రొసెసర్ శక్తితో Mi 11 స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసి ఈ ఘనతను సాధించింది. ఈ Mi 11 స్మార్ట్ ఫోన్ కేవలం ప్రొసెసర్ పరంగా మాత్రమే కాకుండా, ప్రీమియం డిజైన్ మరియు శక్తివంతమైన కెమెరాలతో పాటుగా 2K AMOLED స్క్రీన్ తో సహా గొప్ప ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్ లో 'Pro' మోడల్ ని  కూడా షియోమి తేల్చిచెప్పింది. అందుకే, ఈ స్మార్ట్ ఫోనులో వీలైనన్ని ఎక్కువ మరియు గొప్ప ఫీచర్లను అందించింది. Mi 10 మాదిరిగానే Mi 11 స్మార్ట్ ఫోన్ కూడా ఇండియాను చేరుకుంటుంది, ఈ స్మార్ట్ ఫోన్ 2021 సంవత్సరంలో ఇండియాలో లాంచ్ కావచ్చు. అయితే, Mi 11 ఇండియాలో లాంచ్ డేట్ గురించి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు షియోమి ప్రకటించలేదు.

Xiaomi Mi 11 స్పెషిఫికేషన్లు

Xiaomi Mi 11 స్మార్ట్ ఫోన్ అతిపెద్ద 6.81 అంగుళాల WQHD AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ మీకు 2K రిజల్యూషన్, అంటే 3200×1440 రిజల్యూషన్ అందిస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. అధనంగా, ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్ మరియు  1500 Nits గరిష్ఠమైన బ్రైట్నెస్ తో వుంటుంది. ఇక రక్షణ పరంగా, ఈ డిస్ప్లే సరికొత్త Gorilla Glass Victus తో వస్తుంది.

ఇక కెమెరా విషయంలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త కెమెరా మాడ్యూల్ తో వచ్చింది. Mi 11 లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 108 MP ప్రధాన సెన్సారుకు జతగా 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 5MP మ్యాక్రో కెమెరాను కలిగి వుంటుంది. ఈ కెమెరా 30fps వద్ద 8K UHD రికార్డింగ్ మరియు 60fps వద్ద 4K UHD లో 480P స్లో-మోషన్ వీడియో రికార్డింగ్ చెయ్యగలదు. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 20MP సెల్ఫీ కెమెరా వుంది. ఆడియో పరంగా Harman Kardon సౌండ్ సిస్టంతో వస్తుంది   

Mi 11 స్మార్ట్ ఫోనుకు 4,600 mAh బ్యాటరీ శక్తినిస్తుంది మరియు ఇది 55W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోపాటుగా 50 ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 10W ఫాస్ట్ రివర్స్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లోపల ఎటువంటి ఛార్జర్ ఇవ్వబడదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo