108MP పెంటా కెమేరాని కలిగిన Mi Note 10 ని ఇండియాలో లాంచ్ చేసే దిశగా షావోమి సంస్థ

108MP పెంటా కెమేరాని కలిగిన Mi Note 10 ని ఇండియాలో లాంచ్ చేసే దిశగా షావోమి సంస్థ
HIGHLIGHTS

ఈ ఫోన్ను భారతదేశానికి తీసుకురావచ్చని తెలిసేలా సంకేతాలను అందించడం ప్రారంభించింది.

ఈ నెల ప్రారంభంలోనే చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమి మి నోట్ 10 స్మార్ట్‌ ఫోన్ను ప్రపంచవ్యాప్తంగా 549 యూరోలు(సుమారు రూ. 43,205) వద్ద విడుదల చేసింది. ఇప్పటికే, ఈ ఫోన్ను భారతదేశానికి తీసుకురావచ్చని తెలిసేలా సంకేతాలను అందించడం ప్రారంభించింది. 91mobiles యొక్క తాజా నివేదిక ప్రకారం, షావోమి ప్రస్తుతం మి నోట్ 10 ను భారతదేశంలో విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, దీని గురించిన లాంచ్ తేదీ మాత్రం ఇంకా తెలియరాలేదు. అంతర్జాతీయ వెర్షన్ మాదిరిగానే ఈ మి నోట్ 10 108 MP పెంటా కెమెరా సెటప్‌తో ఇండియాలో రానుంది. అలాగే, విడుదల సమయంలో దీని ధర సుమారు 45,000 రూపాయలు వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ మి నోట్ 10 యొక్క ఇండియా లాంచ్ కోసం, షావోమి ప్రతినిధులు ఇంకా తగిన తేదీని ప్లాన్ చేస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. మి మిక్స్ ఆల్ఫాతో పాటు డిసెంబరులో ఈ హ్యాండ్‌ సెట్‌ ను కంపెనీ లాంచ్ చేయాల్సి ఉందని, అయితే ఆ ప్లాన్ రద్దు చేయబడిందని చెబుతుంది. మి మిక్స్ ఆల్ఫా, కాన్సెప్ట్ ఫోనుకు చెందినది, ఇది దేశంలో అమ్మకాలకు వచ్చినప్పుడు పరిమిత సంఖ్యలో విక్రయించబడుతుంది.

షావోమి మి నోట్ 10 ఒక పెంటా కెమెరా సెటప్‌ తో వస్తుంది, అంటే ఈ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్‌ లో ఐదు ఇండివిడ్యువల్ కెమెరాలు నిలువుగా పేర్చబడి ఉన్నాయి. స్టాక్‌ లోని ప్రాధమిక సెన్సార్ 108MP యూనిట్, f / 1.69 యొక్క ఎపర్చరు మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంటుంది. రెండవ సెన్సార్ 12MP పోర్ట్రెయిట్ యూనిట్, f / 2.0 యొక్క ఎపర్చరు మరియు డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ తో వస్తుంది. మూడవది 10x హైబ్రిడ్ జూమ్‌తో 5MP టెలిఫోటో సెన్సార్. నాల్గవది 20MP అల్ట్రా-వైడ్-యాంగిల్ యూనిట్, ఇది 117 డిగ్రీల దృష్టితో ఉంటుంది. ఐదవ మరియు చివరి సెన్సార్ 2MP మాక్రో యూనిట్. ముందు వైపు, f / 2.0 ఎపర్చరుతో ఒకే ఒక్క 32 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

షావోమి మి నోట్ 10 క్వాల్‌ కామ్ స్నాప్‌డ్రాగన్ 730 G చిప్‌ సెట్‌ తో 6 జీబీ ర్యామ్‌ తో పనిచేస్తుంది. అంతర్గత స్టోరేజి 128GB వరకు ఉంటుంది. దీని డిస్ప్లే ఒక 6.47-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED యూనిట్, గరిష్టంగా 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 600 నిట్స్ యొక్క గరిష్ట బ్రైట్నెస్ ని అందిస్తుంది. ఈ డిస్ప్లే ఉపరితలం క్రింద వేలిముద్ర స్కానర్‌ ను కలిగి ఉంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 చేత రక్షించబడింది. మి నోట్ 10, ఒక 5,260 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, బండిల్ చేసిన 30W ఛార్జర్‌ను ఉపయోగించి 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సంస్థ యొక్క యాజమాన్య MIUI 11 సాఫ్ట్‌ వేర్‌ను కలిగివుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo