Redmi Note 11T 5G: ఎక్స్ టర్నల్ ర్యామ్ మరియు ర్యామ్ బూస్టింగ్ ఫీచర్ తో వస్తోంది

Redmi Note 11T 5G: ఎక్స్ టర్నల్ ర్యామ్ మరియు ర్యామ్ బూస్టింగ్ ఫీచర్ తో వస్తోంది
HIGHLIGHTS

Redmi Note 11T 5G యొక్క బెస్ట్ ఫీచర్లను ఒక్కొక్కటిగా టీజ్ చేస్తోంది

షియోమి తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G యొక్క బెస్ట్ ఫీచర్లను ఒక్కొక్కటిగా టీజ్ చేస్తోంది. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు షియోమి వెల్లడించింది. ఇప్పుడు మరొక ఫీచఫర్ ను కూడా బయటపెట్టింది. అదే, ఎక్స్ టర్నల్ ర్యామ్ ఫీచర్ మరియు ర్యామ్ బూస్టింగ్ ఫీచర్. ఈ నెల 30 న ఇండియాలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి కీలకమైన ఫీచర్ల గురించి కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది.   

Redmi Note 11T 5G నవంబర్ 30న ఇండియాలో లాంచ్ కాబోతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం తన అధికారిక వెబ్సైట్ mi.com నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఈ పేజ్ నుండి ఫోన్ ఫీచర్ల గురించి టీజింగ్ కూడా మొదలుపెట్టింది.

Redmi Note 11T 5G: అంచనా మరియు టీజ్డ్ స్పెక్స్

ఇక ఈ Redmi Note 11T 5G యొక్క అంచనా మరియు టీజ్డ్ స్పెక్స్ గురించి చూస్తే,ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ స్విఫ్ట్ డిస్ప్లేతో వస్తున్నట్లు షియోమి వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ 6nm 5G ప్రాసెసర్, 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన లాంగ్ బ్యాటరీని కూడా కంపెనీ చూపిస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ గా ఎక్స్ టర్నల్ ర్యామ్ మరియు ర్యామ్ బూస్టింగ్ ఫీచర్ లను ప్రత్యేకంగా చూపిస్తోంది. అదనంగా, మెరుగైన కెమెరాలతో ఈ స్మార్ట్ ఫోన్  లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo