REDMI K30 4G మరియు REDMI K30 5G లాంచ్

REDMI K30 4G మరియు REDMI K30 5G లాంచ్
HIGHLIGHTS

రెడ్మి స్మార్ట్ స్పీకర్‌ ను కూడా కంపెనీ విడుదల చేసింది.

షావోమి చైనాలో తన రెడ్మి కె 30 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. అయితే, ఈ  రెడ్మి కె 30 యొక్క 4G మరియు K 30 5G  వేరియంట్‌ ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. కొన్ని నెలల క్రితం భారతదేశంలో లాంచ్ అయిన రెడ్మి కె 20 యొక్క తరువాతి తరం ఫోనుగా  ఈ రెడ్మి కె 30 ని చైనాలో లాంచ్ చేసింది. రెడ్మి AC 2100 రౌటర్, రెడ్మి బుక్ 13 ల్యాప్‌ టాప్, రెడ్మి కె 30 తో పాటు రెడ్మి స్మార్ట్ స్పీకర్‌ ను కూడా కంపెనీ విడుదల చేసింది.

రెడ్మి కె 30 : ప్రత్యేకతలు

రెడ్మి కె 30 లో ఒక 6.67 అంగుళాల డిస్ప్లే  ఉంది. ఇది 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ స్క్రీన్ యొక్క యాస్పెక్ట్ రేషియో  20: 9 గా ఉంటుంది. ఈ రెడ్మి కె 30 5 జి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి చిప్‌ సెట్ చేత అంతర్నిర్మిత 5 జి స్టాండ్-అలోన్ మరియు నాన్-స్టాండ్ అలోన్   (ఎస్‌ఐ / ఎన్‌ఎస్‌ఏ) సబ్ -6 GHz నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. మరోవైపు, రెడ్మి కె 30 4 జి మోడల్ స్నాప్‌డ్రాగన్ 730 జి చిప్‌ సెట్‌ తో పనిచేస్తుంది.

రెడ్మి కె 30 6 జీబీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో వస్తుంది. 6 జీబీ ర్యామ్ మోడల్ 64 జీబీ లేదా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండగా, 8 జీబీ ర్యామ్ వేరియంట్ 128 జీబీ లేదా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అన్ని మోడళ్లలో 512GB వరకు పెంచుకోదగిన మెమరీ ఎంపిక ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారితంగా  MIUI 11 పైన నడుస్తుంది. ఈ పరికరంలో హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్లు ఉన్నాయి.

ఆప్టిక్స్ పరంగా, రెడ్మి కె 30 క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: ఎఫ్ / 1.89 ఎపర్చర్‌తో 64MP  సోనీ IMX 686 సెన్సార్ + ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8 MP  అల్ట్రా-వైడ్ సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్ + 5 MP మాక్రో సెన్సార్ ఉంటాయి. అయితే, 4 జి మోడల్‌లో 5 జి మోడల్‌ లో కనిపించే 5 MP కి బదులుగా 2 MP  మాక్రో లెన్స్ ఉంది. ముందు భాగంలో 20MP సెల్ఫీ షూటర్ మరియు 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి.

రెడ్మి కె 30 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ పరికరం 4500 ఎంఏహెచ్ బ్యాటరీని రెడ్మి కె 30 5 జిలో 30 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 4 జి మోడల్‌లో 27 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ రెడ్మి కె 30 వైట్, బ్లూ రెడ్ మరియు పర్పుల్ రంగులలో వస్తుంది. రెడ్మి కె 30 4 జి వెర్షన్ డిసెంబర్ 12 నుండి చైనాలో లభిస్తుంది మరియు రెడ్మి కె 30 5G   జనవరి 2020 నుండి విక్రయానికి వస్తుంది.

రెడ్మి కె 30 ధర

రెడ్మి కె 30 4 G యొక్క 6 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ మోడల్‌ 1599 యువాన్ల (యుఎస్ $ 227 / రూ. 16,100 సుమారు.) ధరతో ప్రకటించబడింది. మరోవైపు, బేస్ 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ మోడల్ కోసం రెడ్మి కె 30 5 జి ప్రారంభ ధర 1999 యువాన్ (యుఎస్ $ 312 / రూ. 22,160 సుమారు.).

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo