షియోమి లేటెస్ట్ గా నిన్న చైనా విడుదల చేసిన 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఒకదానిని ఇండియాలో అతి త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. క్లియర్ గా చెప్పాలంటే Xiaomi 12X స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో అతి త్వరలో విడుదల చేయనున్నట్లు, 91Mobiles అందించిన ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ ద్వారా ఈ విషయం బయటకి వచ్చింది.
Survey
✅ Thank you for completing the survey!
ఈ Exclusive నివేదిక ప్రకారం, Xiaomi 12X స్మార్ట్ ఫోన్ 8GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుందని కూడా ఈ నివేదిక వెల్లడించింది. చైనాలో విడుదల చేసిన 12 సిరీస్ లో ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ మరియు స్నాప్ డ్రాగన్ 870 ప్రోసెసర్ తో లాంచ్ చెయ్యబడింది.
Xiaomi 12X స్మార్ట్ ఫోన్ ఈ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో తక్కువ ధర ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ ధర RMB 3199 (సుమారు రూ. 37,500) నుండి ప్రారంభమవుతుంది.
Xiaomi 12X : చైనా వేరియంట్ స్పెక్స్
ఈ ఫోన్ 6.28 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ ని కూడా కలిగి వుంది మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ తో వస్తుంది. షియోమి 12X క్వాల్కమ్ Snapdragon 870 చిప్‌సెట్‌తో శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేసే MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.
ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ 50MP OIS ప్రైమరీ కెమెరాని, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. వెనుక కెమెరా 24FPS వద్ద 8K మరియు 60FPS వరకు 4K UHDలో రికార్డ్ చేయగలదు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో Harman Kardon ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్స్ మరియు ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ రీడర్ ఉంది. ఈ ఫోన్ లో 4,500mAh బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మద్దతుతో అందించింది.