Xiaomi 12 Pro: ట్రిపుల్ 50MP కెమెరాలతో సహా భారీ స్పెక్స్ తో వస్తోంది..!!
Xiaomi 12 Pro ను ఇండియా లాంచ్ డేట్ ప్రకటించిన షియోమీ
50MP +50MP + 50MP ట్రిపుల్ కెమెరా సెటప్
గత సంవత్సరం చైనాలో విడుదలైన షియోమి 12 ప్రో
గత సంవత్సరం చివరిలో చైనాలో విడుదలైన Xiaomi 12 సిరీస్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ Xiaomi 12 Pro ను ఇండియాలో విడుదల చేయడానికి షియోమీ డేట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ 50MP కెమెరాలతో సహా భారీ స్పెక్స్ తో చైనాలో విడుదల చెయ్యబడింది. అయితే, ఇండియా వేరియంట్ స్పెక్స్ లో ఏవైనా మార్పులు ఉంటాయా లేక అదే వేరియంట్ ను ప్రకటిస్తుందా అనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే, ఇప్పటి వరకూ రివీల్ చేసిన స్పెక్స్ మరియు ఫీచర్ల ద్వారా కెమెరా మరియు డిజైన్ ఒకేవిధంగా ఉన్నాయి. షియోమీ 12 ప్రో చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఇప్పుడు ఇండియాలో అడుగుపెడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి విడుదల చెయ్యడానికి కంపెనీ డేట్ మరియు టైం ప్రకటించింది. Xiaomi 12 Pro చైనా వేరియంట్ స్పెక్స్ క్రింద చూడవచ్చు.
SurveyXiaomi 12 Pro: స్పెక్స్ (చైనా వేరియంట్)
షియోమి 12 సిరీస్ లో ఇది ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు దీని ధర మాత్రమే కాదు ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల QHD+ (3200×1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.
ఈ ఫోన్ కూడా 12 మాదిరిగా, లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13పై నడుస్తుంది. ఈ ఫోన్ లో OISతో 50MP కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది.
Xiaomi 12 Pro: ధర (చైనా వేరియంట్)
12 సిరీస్ లో ఇది ప్రీమియం వేరియంట్ . ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 8GB+128GB లో RMB 4699 (సుమారు రూ. 55,000) ప్రారంభ ధరతో ఉంటుంది.