Xiaomi 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో త్వరలో విడుదల కావచ్చు… ఎప్పుడంటే..!

Xiaomi 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో త్వరలో విడుదల కావచ్చు… ఎప్పుడంటే..!
HIGHLIGHTS

Xiaomi 12 Series స్మార్ట్ ఫోన్ల ఇండియా లాంచ్ గురించి కొత్త విషయం బయటికి వచ్చింది

Xiaomi 12 మరియు Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్లను ప్రపంచ మార్కెట్లో ప్రకటించవచ్చని తెలుస్తోంది

2022 మార్చి నెలలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయవచ్చు

ఇటీవల షియోమి చైనాలో విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Xiaomi 12 Series స్మార్ట్ ఫోన్ల ఇండియా లాంచ్ గురించి కొత్త విషయం బయటికి వచ్చింది.   2021 డిసెంబర్ నెలలో చైనాలో విడుదలైన ఈ ఫోన్లను ఇండియాలో 2022 ఏప్రిల్ నెలలో ప్రకటించవచ్చని తెలుస్తోంది. అంటే, ఈ సిరీస్ నుండి వచ్చిన  Xiaomi 12 మరియు  Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్లను ప్రపంచ మార్కెట్లోకి తీసుకురావడానికి షియామి తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ల లాంచ్ గురించి టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ ప్రకారం, Xiaomi 12 మరియు Xiaomi 12 ప్రో స్మార్ట్ ఫోన్లను 2022 మార్చి నెలలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. అలాగే, ఏప్రిల్‌లో ఈ స్మార్ట్ ఫోన్లను భారతదేశంలో కూడా ప్రారంభించవచ్చు. MysmartPrice కూడా దీని గురించి ఎక్స్ క్లూజివ్ గా రిపోర్ట్ అందించింది. 

 

 

Xiaomi 12: స్పెక్స్ (చైనా వేరియంట్)

Xiaomi 12 మరియు Xiaomi 12X రెండు కూడా విధమైన డిస్ప్లే ను కలిగివుంటాయి. అయితే, Xiaomi 12 లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ ఎంపికలతో జత చేయబడింది.ఈ ఫోన్ Android 12 ఆధారితంగా రూపొందించబడిన తాజా MIUI 13 పై నడుస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఇందులో కూడా 50MP ప్రైమరీ కెమెరాని, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అయితే, ఈ కెమెరా EIS మరియు OIS సపోర్ట్ కలిగి వుంది మరియు HDR10+తో 30FPS వరకు 4K UHD లో రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Xiaomi 12 Pro: స్పెక్స్ (చైనా వేరియంట్)

 షియోమి 12 సిరీస్ లో ఇది ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు దీని ధర మాత్రమే కాదు ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల QHD+ (3200×1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.

ఈ ఫోన్ కూడా 12 మాదిరిగా, లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13పై నడుస్తుంది. ఈ ఫోన్ లో OISతో 50MP కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది.                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo