Xiaomi 11i లాంచ్ డేట్ ఫిక్స్: 120W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది
xiaomi 11 సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ వస్తోంది
భారీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
xiaomi 11 సిరీస్ ఇప్పటికే 5 స్మార్ట్ ఫోన్లను అందించిన షియోమి ఇప్పుడు మరొక స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయడానికి షియోమి డేట్ ఫిక్స్ చేసింది. ఇప్పుడు 11 సిరీస్ నుండి Xiaomi 11i 5G ఫోన్ ను భారీ ఫీచర్లతో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను జనవరి 6 న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు డేట్ ను ప్రకటించింది. ఈ ఫోన్ ను భారీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి భారీ ఫీచర్లతో తీసుకువస్తునట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ ఫోన్ Flipkart ప్రత్యేకంగా తీసుకువస్తోంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది.
Surveyగత నెల చివరిలో కూడా షియోమి తన Redmi Note 11 సిరీస్ నుండి Note 11T ని విడుదల చేసింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ Amazon, Mi.com మరియు Mi Home నుండి అందుబాటులో వుంది. రెడ్ మి నోట్ 11టి 5జి మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో మొదటిది 6GB ర్యామ్ మరియు 64GB (1GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.16,999. రెండవది 6GB ర్యామ్ మరియు 128GB (2GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.17,999. ఇక చివరిడి 8GB ర్యామ్ మరియు 128GB (3GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.19,999.
Redmi Note 11T 5G: స్పెక్స్
రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.