OnePlus 5T యొక్క లైవ్ లాంచ్ ఈవెంట్ ,Rs 99 లో PVR మూవీస్ లో.

OnePlus 5T యొక్క  లైవ్ లాంచ్ ఈవెంట్ ,Rs 99  లో PVR మూవీస్ లో.

న్యూయార్క్లో జరిగే  ఒక కార్యక్రమంలో కంపెనీ OnePlus 5T స్మార్ట్ఫోన్ ని  విడుదల చేస్తుంది. నవంబర్ 16 న న్యూ యార్క్ లో ఈ ఈవెంట్  ఉదయం 11 గంటలకు జరుగుతుంది, భారతదేశం యొక్క సమయం ప్రకారం 9:30 గంటలకు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవచ్చు, కానీ మీరు మీ సమీపంలోని PVR లో చూడవచ్చు. ఢిల్లీలో, భారతదేశంలో, OnePlus  ఫోన్స్  నవంబరు 16 న PVR చాణక్యపురిలో  లైవ్ చూడొచ్చని  OnePlus చెప్పింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఢిల్లీతో పాటు, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ మరియు పూణే లోని కొన్ని థియేటర్లలో కూడా ఈ లాంచ్  చూడవచ్చు. OnePlus ఫెన్స్  బుక్ మై షో  ద్వారా ఈ టిక్కెట్లు మాత్రమే బుక్ చేయవచ్చు. ఈ బుకింగ్ నవంబరు 10 న 8 గంటలకు ప్రారంభమవుతుంది.OnePlus  స్వయంగా , తన  OnePlus 5T సేల్  నవంబర్ 21 న అమెజాన్ ఇండియాలో మరియు oneplusstore.in లో మొదలవుతుంది అని నివేదించింది. కొద్దికాలం తర్వాత, ఈ డివైస్ దేశంలోని ఇతర సేల్స్  ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది.OnePlus 5T 6 అంగుళాల 18: 9 డిస్ప్లే కలిగి ఉంటుంది, ఇది 2160 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్తో వస్తుంది. OnePlus కో ఫౌండర్ కార్ల్ పీ ఒక OnePlus 5T 3.5mm ఆడియో జాక్ కలిగి ఉందని ధ్రువీకరించారు.ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్తో లభిస్తుంది మరియు లాంచ్ లో రెండు  స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఒకవేరియంట్ లో 6GB RAM మరియు 64GB స్టోరేజ్  ఉండగా, ఇతర వేరియంట్లలో 8GB RAM మరియు 128GB స్టోరేజ్  ఉంటుంది. ఈ డివైస్ డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ ని  కలిగి ఉంటుంది, ఇందులో 16MP ప్రాధమిక సెన్సార్ మరియు 20MP సెకండరీ సెన్సర్ ఉంటుంది. 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo