లేటెస్ట్ Vu QLED Smart Tv పైన ధమాకా ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

లేటెస్ట్ QLED Smart Tv పై అమెజాన్ ధమాకా ఆఫర్ అందించింది

Vu కొత్త స్మార్ట్ టీవీని ఎన్నడూ చూడని తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది

ఈ Vu స్మార్ట్ టీవీ 88W హెవీ సౌండ్ అందించే ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ ను కలిగి వుంది

లేటెస్ట్ Vu QLED Smart Tv పైన ధమాకా ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

Vu బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన లేటెస్ట్ QLED Smart Tv పై అమెజాన్ ధమాకా ఆఫర్ అందించింది. ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ జతగా Vu తెచ్చిన ఈ వరల్డ్ ఫస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు. డిస్కౌంట్ టాప్ పాటు ఈ టీవీ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. మొత్తంగా చూస్తే, ఈ Vu కొత్త స్మార్ట్ టీవీని ఎన్నడూ చూడని తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vu QLED Smart Tv : ఆఫర్స్

Vu క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 33% భారీ డిస్కౌంట్ తో రూ. 32,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. HDFC కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Vu QLED Smart Tv : ఫీచర్స్

ఈ Vu క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ కలిగిన VA క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ లో HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi సపోర్ట్ కూడా ఉంటుంది.

Vu QLED Smart Tv Features

ఈ Vu స్మార్ట్ టీవీ 88W హెవీ సౌండ్ అందించే ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ ను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Also Read: Realme P2 Pro 5G: ఆకర్షణీయమైన డిజైన్ మరియు గొప్ప స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది.!

ఈ స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే, బడ్జెట్ ధరలో ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ మరియు మంచి విజువల్ అందించే బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గా ఇది నిలుస్తుంది. ఒకవేళ ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారు Buy From Here పై నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile