కేవలం మిడ్ రేంజ్ ధరలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా మరియు పంచ్ హోల్ డిజైన్ మరియు గేమింగ్ ఫీచర్లతో వచ్చినటువంటి, వివో Z1 ప్రో యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. ఈ సేల్ ద్వారా కొనుగోలు చేసేవారికి, ఫ్లిప్ కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ సేల్ సందర్భముగా, గరిష్టంగా 13,500 ఎక్స్చేంజి అఫర్ తో లభిస్తోంది. కనుక, మీ పాత ఫోనుతో ఈ ఫోన్నుఎక్స్చేంజి అఫర్ తో తీసుకోదలేచిన వారు తమ మొబైల్ యొక్క బ్రాండ్ మరియు మోడల్ వివరాలను అందించడం ద్వారా మీ ఫోనుతో యెంత ఎక్స్చేంజి అఫర్ లభించనుందో చూడవచ్చు.
1. వివో Z1 ప్రో – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 14,990
2. వివో Z1 ప్రో – 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 16,999
3. వివో Z1 ప్రో – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 17,999
ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికీ 10% తగ్గింపు అందుకునే అవకాశం లభిస్తుంది.
ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో 2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది
వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది. ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది