ViVO Y20G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా 5,000 బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

ViVO Y20G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా 5,000 బ్యాటరీతో లాంచ్ అయ్యింది.
HIGHLIGHTS

వివో తన ViVO Y20G తో 2021 Y సిరీస్ లైన్ అప్ ని రిఫ్రెష్ చేసింది.

Y20G ఫోన్ MediaTek Helio G80 SoC శక్తితో పనిచేస్తుంది.

ViVO Y20G Android 11 ఆధారితంగా Funtuch OS స్కిన్ పైన పనిచేస్తుంది.

వివో తన ViVO Y20G తో 2021 Y సిరీస్ లైన్ అప్ ని రిఫ్రెష్ చేసింది. అయితే, ఈ ఫోన్ మాత్రం వివో Y20, Y20i మరియు Y20A మాదిరి డిజైనుతో కనిపించినా కూడా ViVO Y20G లోపల అందించిన భాగాలూ మాత్రం మెరుగైన పెర్ఫార్మెన్స్ అందించే విధంగా రిఫ్రెష్ చేయబడ్డాయి. కొత్తగా వివో లాంచ్ చేసిన ViVO Y20G గురించి తెలుసుకోవాల్సిన అన్ని వివరాలను క్రింద చూడవచ్చు.

ViVO Y20G ప్రత్యేకతలు

ViVO Y20G ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న 6.52 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 720×1600 పిక్సెల్ రిజల్యూషన్ అందించగల HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G80 SoC శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది మరియు ఇది బేస్ వేరియంట్. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ Android 11 ఆధారితంగా Funtuch OS స్కిన్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ అబ్సిడియన్ బ్లాక్ మరియు ఫ్యూరిస్ట్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ViVO Y20G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగి వుంటుంది. ఈ సెటప్పులో, 13MP ప్రైమరీ కెమేరాకి జతగా 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో తీసుకొచ్చింది. 

ViVO Y20G ధర

ViVO Y20G స్మార్ట్ ఫోన్ రూ.14,990 రుపాయల ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ యొక్క మరొక ప్రత్యేకత ఎమిటంటే, ఈ ఫోన్ మేక్ ఇన్ ఇండియా లో భాగంగా గ్రేటర్ నోయిడా లోని వివో ఫెసిలిటీలో తయారు చేయబడినట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా e-store మరియు పెటియం, టాటా క్లిక్ మరియు అన్ని ప్రధాన ఆఫ్ లైన్ అవుట్ లెట్లల్లో లభిస్తుంది.         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo