VIVO Y11(2019) స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఒక 5,000mAh బ్యాటరీతో విడుదల

VIVO Y11(2019) స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఒక 5,000mAh బ్యాటరీతో విడుదల
HIGHLIGHTS

ఈ ఫోను ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9 స్కిన్ పైన నడుస్తుంది.

వివో ఒక అతిపెద్ద 5,000 బ్యాటరీ మరియు హలొ వ్యూ డిస్ప్లే కలిగిన వివో Y11 స్మార్ట్ ఫోన్ను కేవలం బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న మరియు వినియోగదారులకు అవసరమైన అన్ని హంగులతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ను అన్ని ఫీచర్లతో కేవలం రూ.8,990 రుపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేసింది.

VIVO Y11 ఆఫర్లు మరియు సేల్ 

ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 28 వతేది నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది మరియు వివో అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్లలో ఇది సేల్ కి అందుబాటులోకి ఉంటుంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, ICICI, HDFC మరియు AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు పైన 5%క్యాష్ బ్యాక్ ఆఫరును అందిస్తోంది. అలాగే, IDFC First బ్యాంకు HDB మరియు హోమ్ క్రెడిట్ నుండి EMI స్కీమ్ తో కూడా కొనవచ్చు. ఇక ఆన్లైన్ అఫర్ లో భాగంగా No Cost EMI అందుబాటులో ఉంటుంది.

VIVO Y11 : ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.35 అంగుళాల పరిమాణం గల HD+ హలొ వ్యూ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే ఒక 19.3:9 యాస్పెక్ట్ రేషియా మరియు 89% స్క్రీన్ టూ బాడీ రేషియాతో ఉంటుంది. ఈ ఫోన్, మినరల్ బ్లూ మరియు అగటి రెడ్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు ఇది 12nm ఆక్టా కోర్ ప్రాసెసర్.దీనికి జతగా 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో వస్తుంది. అలాగే, ఈ ఫోను ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9 స్కిన్ పైన నడుస్తుంది. 

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 2 డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo