Vivo Y01: వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్..!!

HIGHLIGHTS

వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా Vivo Y01 ను విడుదల చేసింది

Vivo Y01 ను 10 రూపాయల సబ్ కేటగిరిలో ఇటీవల విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ vivo.com మరియు ఇతర అధీకృత రిటైల్ స్టోర్‌ లలో అందుబాటులో ఉంది

Vivo Y01: వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్..!!

వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా Vivo Y01 ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 10 రూపాయల సబ్ కేటగిరిలో ఇటీవల విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్  vivo.com మరియు ఇతర అధీకృత రిటైల్ స్టోర్‌ లలో అందుబాటులో ఉంది. ఈ లేటెస్ట్ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio P35 చిప్‌సెట్, 2+32GB మెమరీ అప్షన్, HD+ స్క్రీన్, ఫన్ టచ్ OS 11.1 మరియు పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo Y01: ధర

Vivo Y01 స్మార్ట్ ఫోన్ భారతదేశంలో Vivo.com మరియు ఇతర అధీకృత రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది మరియు ఈ ఫోన్ ధర రూ. 8,999.

Vivo Y01: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.51 ఇంచ్ HD రిజల్యూషన్ డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio P35 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android Go ఆధారంగా Funtouch OS 11.1 సాఫ్ట్‌వేర్ పైన పనిచే నడుస్తుంది.

ఇక కెమెరాలు మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ వెనుక కేవలం 8MP సింగిల్ కెమెరా సేతువు మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రో-USB 2.0, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 బిగ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo