ViVo X70 Pro మరియు X70 Pro+ లాంచ్: కెమెరా సిస్టం ఒక రేంజ్ లో..!

ViVo X70 Pro మరియు X70 Pro+ లాంచ్: కెమెరా సిస్టం ఒక రేంజ్ లో..!
HIGHLIGHTS

ViVo X70 Pro మరియు X70 Pro+ విడుదల

ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా ఈ ఫోన్ల సొంతం

సొంత ఇమేజింగ్ చిప్ V1 తో మెరుగైన పెర్ఫార్మెన్స్

చాలా కాలంగా ఎదురుచూస్తున్న ViVo X70 Pro మరియు X70 Pro+ విడుదల. స్మార్ట్ ఫోన్లను ప్రీమియం ధరలో వివో లాంచ్ చేసింది. వాస్తవానికి, ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి చాలా లీక్స్ మరియు రూమర్లు కూడా ఆన్లైన్లో వెల్లువెత్తాయి. అయితే, వీటన్నిటికి తెరదించుతూ వివో ఈ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్లు ఇన్ బిల్ట్ అల్ట్రా-సెన్సింగ్ గింబాల్‌తో ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా అనుభవాన్ని అందిస్తాయని వివో తెలిపింది. ఇది మాత్రమే కాదు వివో యొక్క సొంత ఇమేజింగ్ చిప్ V1 తో మెరుగైన పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా పేర్కొంది.

ViVo X70 Pro మరియు X70 Pro+ : ధర

X70 Pro+ యొక్క (12GB +256GB) వేరియంట్ ధర రూ.79,990 మరియు  X70 Pro+అక్టోబర్ 12, 2021 నుండి అమ్మకానికి వస్తుంది. X70 ప్రో యొక్క (8GB +128GB) ధర రూ.46,990, (8GB +256GB) వేరియంట్ రూ.49,990 మరియు (12GB +256GB) వేరియంట్ ధర రూ.52,990 మరియు అక్టోబర్ 7, 2021 నుండి సేల్ ప్రారంభమవుతుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందు

బాటులో ఉంటాయి.        

ViVo X70 Pro మరియు X70 Pro+: ప్రత్యేకతలు

ViVo X70 Pro+ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888+ చిప్‌సెట్‌ని శక్తితో పనిచేస్తుంది మరియు X70 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC తో పనిచేస్తుంది. ఈ రెండూ స్మార్ట్ ఫోన్లు కూడా 5G సామర్థ్యాలతో వస్తాయి. వివో ఎక్స్ 70 ప్రో+ స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ అందించే IP682 రేటింగ్‌తో కలిగివుంది. ఇది వివో 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ 3 కి కూడా మద్దతు ఇస్తుంది, ఇది 26 నిమిషాల్లో 1-50% ఛార్జ్ అవుతుంది.

ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది మరియు X70 ప్రో+ గ్లాస్‌పై సిరామిక్ బాడీని, ఫ్లోరైట్ AG ఫినిషింగ్‌తో పాటుగా లీనమయ్యే 3 డి కర్వ్డ్ స్క్రీన్‌ను అందిస్తుంది. X70 ప్రో+ కూడా ఎనిగ్మా బ్లాక్‌లో అత్యాధునిక డిజైన్‌తో వస్తుంది. X70 ప్రో రెండు అద్భుతమైన రంగులలో అందుబాటులో ఉంటుంది అవి – కాస్మిక్ బ్లాక్ మరియు అరోరా డాన్.

ఇక కెమెరాల విషయానికి వస్తే, వివో ఆప్టిక్స్‌లో గ్లోబల్ టెక్నాలజీ లీడర్ అయిన ZEISS తో తన వ్యూహాత్మక ఇమేజింగ్ భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. ఈ X70 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ సహజంగా కనిపించేలా ఫోటోగ్రాఫ్స్ మరియు వీడియోలను రూపొందించడానికి వివో యొక్క లేటెస్ట్ హార్డ్‌వేర్ మరియు ఐకానిక్ ఎలిమెంట్‌లను చేర్చడానికి ప్రయత్నిస్తుంది. ఇది 32MP ఫ్రంట్ కెమెరా మరియు X70 ప్రో + ఫోన్ 50MP + 48MP + 12MP + 8MP క్వాడ్-కెమెరా సెటప్ తో మరియు X70 ప్రో ఫోన్ మాత్రం 50MP + 12MP + 12MP + 8MP సెటప్ తో వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo