Vivo X300 Series లాంచ్ కంటే ముందే టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Vivo X300 Series రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది
వివో ఎక్స్ 300 మరియు వివో ఎక్స్ 300 రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది
వివో ఎక్స్ 300 సిరీస్ డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది
Vivo X300 Series రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ సిరీస్ నుంచి వివో ఎక్స్ 300 మరియు వివో ఎక్స్ 300 రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్ 200MP ZEISS కెమెరా మరియు మరింత గొప్ప ఫోటోగ్రఫీ అందించే ఫోటోగ్రఫర్ కిట్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది. ఈ కొత్త సిరీస్ నుంచి వివో లాంచ్ చేస్తున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.
SurveyVivo X300 Series : లాంచ్
వివో ఎక్స్ 300 సిరీస్ డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. అంటే, ఈ వివో కొత్త సిరీస్ ఫోన్లు రేపు ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈ సిరీస్ నుంచి ఎక్స్ 300 మరియు వివో ఎక్స్ 300 రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఇప్పటికే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా వివో బయటకు వెల్లడించింది.
Vivo X300 Series : టాప్ ఫీచర్స్
వివో ఎక్స్ సిరీస్ నుంచి అందించే ఫోన్స్ లో ఎక్స్ 300 ప్రో స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్స్ తో ఉంటుంది. అయితే, ఎక్స్ 300 స్మార్ట్ ఫోన్ కూడా దాదాపు అదే ఫీచర్స్ తో ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ కెమెరా మరియు డిజైన్ లో స్వల్పమైన మార్పులు ఉంటాయి. ఎక్స్ 300 ప్రో యూని బాడీ 3D డిజైన్ మరియు 1.1mm అల్ట్రా స్లిమ్ సిమెట్రిక్ బెజెల్స్ కలిగి ఉంటుంది. ఎక్స్ 300 ఫోన్ 3 యూని బాడీ 3D గ్లాస్ డిజైన్ తో ఉంటుంది మరియు ఇది అతి సన్నని 1.05mm అల్ట్రా స్లిమ్ సిమెట్రిక్ బెజెల్స్ తో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా చాలా అందమైన లుక్స్ తో ఆకట్టుకుంటాయి.

ఈ రెండు ఫోన్లు కూడా మీడియాటెక్ Dimensity 9500 చిప్ సెట్ తో పని చేస్తాయి. ఇది 3nm ప్రోసెస్ టెక్నాలజీ తో ఉంటుంది. దానికి జతగా కెమెరా పనులు గొప్ప కెమెరా నిర్వహించే V3+ ఇమేజింగ్ చిప్ మరియు VS1 చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ LPDDR5x ర్యామ్ మరియు వేగవంతమైన ఫాస్ట్ స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో గింబాల్ గ్రేడ్ 50MP (LYT-828) మెయిన్ కెమెరా, 200MP ZEISS APO టెలిఫోటో కెమెరా, 50MP (JN1), వైడ్ యాంగిల్ కెమెరా మరో సెన్సార్ కలిగిన క్వాడ్ కెమెరా మరియు ముందు 50MP ZEISS సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 120 FPS వద్ద 4K డాల్బీ విజన్ వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. దీనికి తోడు సూపర్ జూమ్ అందించే ఫోటోగ్రాఫర్ కిట్ కూడా అందిస్తుంది.
Also Read: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!
ఇక ఎక్స్ 300 ఫోన్ విషయానికి వస్తే, ఇందులో వెనుక 200MP ZEISS మెయిన్, 50MP టెలిఫోటో మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన రియర్ కెమెరా మరియు ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు లాంచ్ ప్రైస్ వివరాలతో రేపు కలుద్దాం.