లేటెస్ట్ 12.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందించింది.!
అమెజాన్ ఇండియా జబర్దస్త్ సౌండ్ బార్ అందించింది
ఈ సౌండ్ బార్ గత నెల ఇండియాలో లాంచ్ అయ్యింది
ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకుని మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది
అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ 12.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ గత నెల ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకుని మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సరౌండ్ అందించే పూర్తి సెటప్ కలిగి ఉంటుంది.
Survey12.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్ ఏమిటి?
Blaupunkt లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన SBW600 XCEED Emperor సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ఇండియాలో రూ. 69,999 ప్రైస్ తో విడుదలైన ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈరోజు అదే ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ పై ఏకంగా రూ. 10,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ కూపన్ ఆఫర్ తో జతగా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ పై HDFC మరియు IDFC FIRST క్రెడిట్ కార్డు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 58,499 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. లాంచ్ ధరతో పోలిస్తే, ఈరోజు ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి రూ. 11,500 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: Realme 16 Pro Series: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
Blaupunkt 12.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ 12.1.4 సౌండ్ సెటప్ వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు నాలుగు సెంటర్, రైట్ అండ్ లెఫ్ట్ స్పీకర్, సైడ్ ఫైరింగ్ స్పీకర్, రియర్ అప్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ తో మొత్తం 12 స్పీకర్లు కలిగిన సూపర్ బార్ ఉంటుంది. దీనితో పాటు మూడు మరియు పైన అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కొద ఉంటుంది. ఇది మొత్తం సరౌండ్ సెటప్ అయితే, ఈ సౌండ్ బార్ తో 8 ఇంచ్ పవర్ ఫుల్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.
ఈ సౌండ్ బార్ మొత్తం 17 స్పీకర్లు కలిగి టోటల్ 1200W RMS జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన ఈ పూర్తి సెటప్ తో సినిమా హాల్ ని మరపించే జబర్దస్త్ సౌండ్ అందిస్తుందని బ్లౌపంక్ట్ చెబుతోంది. ఇందులో Aux, HDMI e ARC, ఆప్టికల్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile