Vivo X300 FE స్మార్ట్ ఫోన్ పై నమ్మసఖ్యం కాని డిస్కౌంట్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
Vivo X300 FE స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది
ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పైన నమ్మసఖ్యం కాని భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది
ఈ ఫోన్ ను ఏకంగా రూ. 1,3000 రూపాయల తక్కువ ధరలో అందుకోవచ్చు
Vivo X300 FE స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పైన నమ్మసఖ్యం కాని భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను ఏకంగా రూ. 1,3000 రూపాయల తక్కువ ధరలో అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఫోన్ ఆఫర్ అండ్ ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
Vivo X300 FE: ఆఫర్ ఏమిటి?
వివో ఎక్స్ 300 FE స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 89,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్స్ లో అందించింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ రోజు ఈ ఫోన్ పైన ఏకంగా రూ. 13,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ మీరు రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.
ఇక ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 13,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదే ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ ను ఈ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే రూ. 14,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తుంది.
Vivo X300 FE: ఫీచర్స్
వివో ఎక్స్ 300 FE స్మార్ట్ ఫోన్ లో 6.31 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ తో మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనిచేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ZEISS టెక్నాలజీతో కూడిన 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని వివో అందించింది. ఇందులో ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్ చిత్రాలు మరియు జూమ్ ఫొటోల కోసం ప్రత్యేక కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 6,500mAh బిగ్ బ్యాటరీ ఉంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 40W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.