Vivo X300 FE మరియు X300 Ultra ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వివో.!

HIGHLIGHTS

వివో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వివరాలు రిలీజ్ చేసింది

Vivo X300 FE మరియు X300 Ultra ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు వివో ఈరోజు అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ లను అల్ట్రా కెమెరా ఫోన్ లుగా ఇండియాలో లాంచ్ చేసినట్లు అనిపిస్తోంది

Vivo X300 FE మరియు X300 Ultra ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వివో.!

వివో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వివరాలు రిలీజ్ చేసింది. Vivo X300 FE మరియు X300 Ultra స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు వివో ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ నుంచి విడుదల చేసిన టీజర్ ఇమేజ్ లను చూస్తుంటే, ఈ ఫోన్ లను అల్ట్రా కెమెరా ఫోన్ లుగా ఇండియాలో లాంచ్ చేసినట్లు అనిపిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo X300 FE మరియు X300 Ultra: లాంచ్ డేట్

వివో ఎక్స్ FE మరియు ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను వివో ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సిరీస్ ఫోన్ లను ‘కమింగ్ సూన్’ ట్యాగ్ తో టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి.

Vivo X300 FE మరియు X300 Ultra: ఫీచర్స్

ఈ రెండు ఫోన్లా లాంచ్ గురించి మాత్రమే కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్లు కలిగిన స్పెక్స్ లేదా ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా కొన్ని ఫీచర్స్ వెల్లడయ్యాయి. వివో ఎక్స్ 300 FE స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ తో సూపర్ జూమ్ కోసం అదనపు కిట్ సపోర్ట్ ఉన్నట్లు చూపించింది.

Vivo X300 FE and vivo X300 Ultra

ఇక ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి DSLR కెమెరా మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఫోన్ తో కూడా గత సిరీస్ మాదిరిగా ప్రొఫెషనల్ కెమెరా కిట్ ను జత చేసింది. ఇందులో బ్యాటరీ మరియు జూమ్ సెటప్ ఉన్నట్లు చూడొచ్చు.

Also Read: Lumio Vision 9: ప్రీమియం QD MINI LED స్క్రీన్ సహా గొప్ప ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్.!

వివో ఎక్స్ 300 అల్ట్రా : రూమార్డ్ ఫీచర్స్

వివో ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ రూమార్డ్ ఫీచర్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రూమర్స్ ప్రకారం, 6.8 అంగుళాల AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 లాంచ్ చేస్తుందని కూడా రూమర్లు ఉన్నాయి.

కెమెరా పరంగా ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం కెమెరా సెటప్ కలిగి ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 200MP మెయిన్, 200MP టెలిఫోటో, ఒక అల్ట్రా వైడ్ మరియు మరో కెమెరా కలిగిన క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లు రూమర్లు చెబుతున్నాయి. ఇది ప్రొఫెషనల్ మరియు DSLR లెవల్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని చెబుతున్నారు.

అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ అఫీషియల్ గా విడుదల చేసినప్పుడు మాత్రమే ఈ రూమర్డ్ ఫీచర్స్ లో నిజం ఎంత ఉందో తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo