Vivo V80 smartphone india launch announced
Vivo V80: వివో ఇండియాలో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో 80 ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది. ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్ ను ఆకట్టుకునే ఫీచర్స్ తో ఫోన్ అందించే వి సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మును వివో ఇప్పటి వరకు ఆఫర్ చేయని సరికొత్త ఆరంజ్ కలర్ లో పరిచయం చేస్తోంది.
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి80 లాంచ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ ఇండియా లాంచ్ మాత్రం కన్ఫర్మ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ గత సిరీస్ కంటే మరింత పవర్ ఫుల్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని వివో టీజింగ్ చేస్తోంది.
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ఫీచర్స్ లిస్ట్ తో టీజింగ్ చేసింది. అయితే, ఈ ఫీచర్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.
వివో వి 80 స్మార్ట్ ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ టీజర్ లో అందించిన టీజర్ ఇమేజ్ చూస్తుంటే, ఇది దాదాపు ఐఫోన్ 17 ప్రో మాదిరి డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కొత్త ఆరంజ్ కలర్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ వంటి ఫీచర్స్ కలిగి ఉండటమే ఇందుకు కారణంగా అనిపిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక ZEISS లోగో తో ట్రిపుల్ రియర్ కెమెరా మరియు LED ఫ్లాష్ ఉన్నాయి.
Also Read: Oppo K14 Lite స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ అండ్ స్టైలిష్ డిజైన్ తో వచ్చింది.!
ఈ అప్ కమింగ్ వివో ఫోన్ సినిమాటిక్ కెమెరాతో వస్తోందని వివో ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెబుతోంది. ఇదే కాదు ఈ ఫోన్ లో ప్రత్యేకమైన AI Camera ఫీచర్స్ ఉన్నాయని కూడా వివో చెబుతోంది. అలాగే, ఈ ఫోన్ లో V సిరీస్ లో ఎన్నడూ చూడని బిగ్ బ్యాటరీ ఉందని కూడా వివో చెబుతోంది. ఈ వివరాలు ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు.