Vivo V70 FE 5G with 200MP camera launched know the price and features
Vivo V70 FE 5G: గత నెల రోజులుగా వివో టీజింగ్ చేస్తున్న వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో భారీ 200MP కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందామా.
వాస్తవానికి, ఈ ఫోన్ లాంచ్ కావడానికి అంటే ముందే ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. కంపెనీ కూడా అదే లీక్డ్ ప్రైస్ ను నిజం చేస్తూ సేమ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ వివో ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మాన్సూన్ బ్లూ మరియు నాథర్న్స్ లైట్ పర్పల్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ల ను ఈరోజు నుంచి వివో స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది.
ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా వివో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై Axis అండ్ కోటక్ బ్యాంక్ 10% తక్షణ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా 10% ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఈ ఫోన్ పై అందించింది. అదనంగా, ఈ ఫోన్ పై 1 సంవత్సరం అదనపు వారంటీ మరియు iQOO TWS 1e ఇయర్ బడ్స్ ను తక్కువ రేటుకే అందుకునే అవకాశం కూడా అందించింది.
Also Read: Realme 16 5G: సరికొత్త డిజైన్ మరియు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్ సెట్ జతగా 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్ ఉంది. ఇది HDR 10+ సపోర్ట్, 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజన్ లో కొత్త డార్క్ నెస్ గ్లో టెక్నాలజీ తో కూడా వస్తుంది.
ఈ వివో కొత్త ఫోన్ అల్ట్రా స్టెబిలైజేషన్ కలిగిన 200MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ డ్యూయల్ రియర్ కెమెరాతో వచ్చింది మరియు ముందు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరా అండర్ వాటర్ ఫోటో గ్రఫీ, 4K వీడియో మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో కూడా 7000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వచ్చింది.