Vivo V50e 5G: వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
వివో ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది
Vivo V50e 5G ను చూడగానే ఆకర్షించే డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ డిజైన్, స్క్రీన్ మరియు కెమెరా పరంగా ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది
Vivo V50e 5G : వివో ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఆదే
వివో వి50e స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను చూడగానే ఆకర్షించే డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్, స్క్రీన్ మరియు కెమెరా పరంగా ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. మరి ఈరోజే సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకుందామా.
SurveyVivo V50e 5G: ఫీచర్స్
వివో ఈ కొత్త ఫోన్ ను లగ్జరీ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంటుంది. వి50e స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డైమండ్ షీల్డ్ గ్లాస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ HDR 10+ మరియు Netflix HDR సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB (UFS 2.2) ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, వివో వి50e స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony MX882 మెయిన్ కెమెరా మరియు అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP AF గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటునాయి. ఈ ఫోన్ కెమెరా AI కెమెరా ఫీచర్స్, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మరియు వెడ్డింగ్ పోర్ట్రైట్ స్టైల్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
వివో వి50e స్మార్ట్ ఫోన్ లో 5600 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వివో కొత్త స్మార్ట్ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ ను కూడా ఈరోజు నుంచే ప్రారంభించింది.
Also Read: Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
Vivo V50e 5G: ప్రైస్
వివో వి50e స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 33,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ ను రూ. 35,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్స్
వివో వి50e స్మార్ట్ ఫోన్ పై మంచి లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై HDFC/ICICI/ SBI క్రెడిట్ కార్డు స్వైప్ పై రూ. 3,100 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 3,100 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.