Vivo V50 launch: అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!

HIGHLIGHTS

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ఈ రోజు అనౌన్స్ చేసింది

Vivo V50 launch కన్ఫర్మ్ చేసింది

భారీ ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో అందిస్తున్నట్లు గొప్పగా చెబుతోంది

Vivo V50 launch: అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!

Vivo V50 launch: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ఈ రోజు అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు కేవలం ఫీచర్స్ తో మాత్రమే టీజింగ్ చేసిన వివో ఈరోజు వివో వి 50 లాంచ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా వివో బయటపెట్టింది. వివో ఈ అప్ కేమయింగ్ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో అందిస్తున్నట్లు గొప్పగా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V50 launch

వివో వి 50 స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు డేట్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్, కీలకమైన ఫీచర్స్ ను కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ పై కూడా ఒక లుక్కేద్దాం పదండి.

Vivo V50 launch Date Confirmed

Also Read: Realme 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ పై వాలెంటైన్స్ డే బిగ్ డీల్ ప్రకటించిన రియల్ మీ.!

Vivo V50 : ఫీచర్స్

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ట్రిపుల్ 50MP ZEISS కెమెరా సపోర్ట్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో 50MP + 50MP డ్యూయల్ రియర్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ గొప్ప పోర్ట్రైట్ ఫోటోలు మరియు గొప్ప 4K వీడియోలు అందించే సత్తా కలిగి ఉంటుందని కూడా వివో తెలిపింది. అంతేకాదు, భారతీయ వెడ్డింగ్ కలక్షన్ కోసం ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రైట్ స్టూడియో కూడా ఈ ఫోన్ లో ఉందట.

వివో వి 50 అత్యంత కఠినమైన డైమండ్ షీల్డ్ గ్లాస్ రక్షణ కలిగిన అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ఫినిటీ వ్యూ అందించే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ ను రెడ్ రోజ్, స్టారీ నైట్ మరియు టైటానియం గ్రే మూడు కలర్ వేరియంట్లలో అందిస్తుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Vivo V50

ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ఓవరాల్ డిజైన్ చూస్తుంటే, ఈ ఫోన్ చాలా సన్నగా ఉండే పటిష్టమైన ఫోన్ గా కనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo