Vivo v29 Pro Launched: Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరాతో లాంచ్ అయ్యింది| New Phone

Vivo v29 Pro Launched: Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరాతో లాంచ్ అయ్యింది| New Phone
HIGHLIGHTS

ViVO ఈరోజు v29 Series నుండి v29 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరాతో వివో లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను అల్ట్రా స్లిమ్ 3D Curved AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లతో తీసుకు వచ్చింది

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ViVO ఈరోజు ఇండియన్ మార్కెట్ లో v29 Series నుండి v29 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరాతో వివో లాంచ్ చేసింది. వివో ఈ స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా స్లిమ్ 3D Curved AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లతో తీసుకు వచ్చింది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్, ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలను పూర్తిగా తెలుసుకోండి.

Vivo v29 Pro Price

వివో వి29 ప్రో స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ వేరియంట్స్ మరియు వీటి ధరలను క్రింద చూడవచ్చు.

  1. వివో వి29 ప్రో (8 GB RAM + 256 GB) వేరియంట్ ధర రూ. 39,999
  2. వివో వి29 ప్రో (12 GB RAM + 256 GB) వేరియంట్ ధర రూ. 42,999

ఈ ఫోన్ ను HDFC/ICICI/ Credit Card & Debit ఫుల్ స్వైప్ మరియు క్రెడిట్ కార్డ్ EMI పైన కూడా Rs. 3,500 తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది వివో. అయితే, ఈ ఆఫర్ Valid only on E-Store అని కూడా నొక్కి చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన Rs. 3,500 అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా వివో ప్రకటించింది.

Flipkart నుండి ఈ ఫోన్ లభిస్తుంది మరియు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ ఫోన్ పైన సెలక్టెడ్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ పైన రూ. 3,500 డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ Pre-Bookings ఈరోజు నుండి స్టార్ట్ చేసింది వివో.

Also Read: Gold Price Update: దారుణంగా పడిపోయిన బంగారం ధర..New Price ఎంతంటే.!

వివో వి29 ప్రో ప్రత్యేకతలు

వివో వి29 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ అల్ట్రా స్లిమ్ 3D Curved AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 8200 ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు జతగా 8GB / 12GB RAM మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది.

vivo v29 Pro with Sony professional portrait camera
Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరా

ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 50 MP OIS (Sony IMX663) + 12 MP పోర్ట్రైట్ + 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా లో టన్నుల కొద్దీ కెమేరా మోడ్స్ మరియు ఫీచర్స్ ఉన్నట్లు వివో చెబుతోంది. ఇందులో అందించిన Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరాతో గొప్ప ఫోటోలు తియ్యవచ్చని కూడా చెబుతోంది.

అలాగే, ముందు భాగంలో 50 MP Eye AF గ్రూప్ సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ 80 W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4600 mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

 
Digit.in
Logo
Digit.in
Logo