Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ 44MP AF భారీ సెల్ఫీ కెమెరాతో వచ్చింది
Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది
44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ Android 12 OS
V23e 5G ఫోన్ లో 44MP ఐ AF సెల్ఫీ కెమెరాని అందించింది
వివో ఈరోజు 44MP భారీ సెల్ఫీ కెమెరాతో Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ Android 12 OS వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కలిగివుంది. వివో V23 సిరీస్ నుండి వచ్చిన మూడవ స్మార్ట్ ఫోన్ Vivo V23e 5G. ఈ స్మార్ట్ ఫోన్ రూ.25,999 రూపాయల ధరతో ప్రకటించింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో లేటెస్ట్ గా వచ్చిన ఈ వివో స్మార్ట్ ఫోన్ పూర్తి విశేషాలు చూద్దాం.
SurveyVivo V23e 5G: Price
Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ కేవలం 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నెల్ స్టోరేజ్ కలిగిన ఒకేఒక్క వేరియంట్ తో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.25,990 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క సేల్స్ ఫిబ్రవరి 21, అంటే ఈరోజు నుండి ప్రారంభమైంది మరియు వివో ఇండియా ఇ-స్టోర్, Flipkart మరియు వివో భాగస్వామి రిటైల్ స్టోర్ల ద్వారా కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Vivo V23e 5G: స్పెక్స్
వివో వి23e 5G స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేని FHD+ (2400×1080)రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లేలో వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించింది. ఈ ఫోన్ MediaTek Dimensity 810 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, ఎక్స్ టెండెడ్ RAM 2.0 ఫీచర్ తో 4GB వరకూ వర్చువల్ ర్యామ్ అందుతుంది.
ఈ ఫోన్ డిజైన్ పరంగా కేవలం 7.32mm మందంతో చాలా సన్నగా ఉంటుంది మరియు బ్యాక్ గ్లాస్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ మరియు సన్ షైన్ గోల్డ్ అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
V23e 5G ఫోన్ లో 44MP ఐ AF సెల్ఫీ కెమెరాని అందించింది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ కలిగిన 4050mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.