ViVO V23 Series: 50MP డ్యూయల్ సెల్ఫీ వంటి భారీ ఫీచర్లతో లాంచ్… ధర ఎంతంటే…!

ViVO V23 Series: 50MP డ్యూయల్ సెల్ఫీ వంటి భారీ ఫీచర్లతో లాంచ్… ధర ఎంతంటే…!
HIGHLIGHTS

ViVO V23 Series ఇండియాలో విడుదల

50MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా వంటి చాలా యూనిక్ ఫీచర్లను అందించింది

ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది

చాలా కాలంగా వివో ఊరిస్తున్న ViVO V23 Series ను ఇండియాలో విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి V23 మరియు V23 Pro రెండు స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ లలో కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానల్, 50MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా వంటి చాలా యూనిక్ ఫీచర్లను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

లాంచ్ సమయంలో ఈ ఫోన్ల పైన మంచి ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ను ప్రీ ఆర్డర్ చేసే వారికి  ఆఫర్లను అందుబాటులో ఉంచింది. HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI పైన Vivo V23 Pro ప్రీ బుక్ చేసుకునేవారికి 3,000 ఫ్లాట్ డిస్కౌంట్ మరియు Vivo V23 పైన  2500 ఫ్లాట్ డిస్కౌంట్ ను చేస్తోంది. ఇది మాత్రమే కాదు, 70% బై బ్యాక్ పాలసీ, 9 నెలల No Cost EMI మరియు ఎక్స్ చేంజ్ పైన 2,000 రూపాయల వరకూ అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ వంటి ఆఫర్లను ప్రకటించింది.                   

Vivo V23 Pro: స్పెక్స్

Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB/12GB ర్యామ్ మరియు 128/256 GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్ మెటల్ బాడీ మరియు 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 

ఈ ఫోన్ లో 50MP Eye AF డ్యూయల్ సెల్ఫీ కెమెరాని అందించింది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో,  108MP AF కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ కలిగిన 4300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Vivo V23 : స్పెక్స్

Vivo V23 స్మార్ట్ ఫోన్ 6.44 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ MediaTek Dimensity 920 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB/12GB ర్యామ్ మరియు 128/256 GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్ మెటల్ బాడీ మరియు కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానల్ తో వస్తుంది. 

ఈ ఫోన్ లో కూడా 50MP Eye AF డ్యూయల్ సెల్ఫీ కెమెరాని అందించింది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో,  64MP AF కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ కలిగిన 4200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

 Vivo V23 Series: ధర

ఈ సిరీస్ లో వివో V23 8GB ర్యామ్ బేసిక్ వేరియంట్ రూ.29,990 ప్రారంభ ధరలో వస్తుంది. అలాగే, వివో V23 ప్రో 8GB ర్యామ్ బేసిక్ వేరియంట్ రూ.38,990 ప్రారంభ ధరలో వస్తుంది   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo