ఇటీవల మేము అందించిన నివేదిక ప్రకారం ViVo V సిరీస్ నుండి Vivo V23 5G మరియు Vivo V23 Pro 5G స్మార్ట్ ఫోన్లను 2022 ప్రారంభంలో విడుదల చేయడానికి వివో సిద్ధమవుతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్లను జనవరి 5 న విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించినది.
Survey
✅ Thank you for completing the survey!
వివో ఈ ఫోన్లను అత్యంత సన్నని డిజైన్ తో తీసుకువస్తోంది. ఈ ఫోన్ల వెనుక ప్యానల్ లో ఒక విలక్షణమైన గ్లాస్ ను కూడా అందించింది. సన్ లైట్ లేదా మరేదైనా వెలుగు ఈ ఫోన్ గ్లాస్ పైన పడినప్పుడు ఈ ప్యానల్ రంగులను మార్చగలదని Vivo తెలిపింది. అంతేకాదు, టీజర్ ద్వారా ఈ ఫోన్ ముందుభాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా మరియు వార్మ్ లైట్ లను కూడా కలిగివున్నట్లు వెల్లడించింది.
Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ శక్తితో వచ్చే అవకాశం వుంది. అంతేకాదు, ఇది 8GB ర్యామ్ తో జతచేయబడుతుందని కూడా భావిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లే, 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 5GB వర్చువల్ మెమోరిని కూడా ఈ ఫోన్ లో జోడించవచ్చని అంచనా వేస్తున్నారు.
కెమెరా పరంగా ఫీచర్లను ఇప్పటికే వివో టీజ్ చేస్తోంది. ఈ టీజింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో 50MP Eye AF డ్యూయల్ సెల్ఫీ కెమెరాని అందించనట్లు వెల్లడించింది. అలాగే, వెనుక 108MP ట్రిపుల్ కెమెరా సెటప్ ను గురించి కూడా టీజింగ్ ద్వారా చూపించింది.