సూపర్ కెమేరా ఫీచర్లతో విడుదలైన VIVO V17 స్మార్ట్ ఫోన్ : ధర, ప్రత్యేకతలు మరియు పూర్తి వివరాలు..

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Dec 2019
సూపర్ కెమేరా ఫీచర్లతో విడుదలైన VIVO V17 స్మార్ట్ ఫోన్ : ధర, ప్రత్యేకతలు మరియు పూర్తి వివరాలు..

Work from home seamlessly with Airtel Xstream

Airtel Xstream Fiber provide you 1Gbps internet speed and top-notch benefits

Click here to know more

చాలా టీజింగులు మరియు లీకుల తరువాత ఎట్టకేలకు, వివో తన VIVO V17 స్మార్ట్ ఫోన్ను ఇప్పుడు ఇండియాలో విడుదల చేసింది. ఈ వివో V17 స్మార్ట్ ఫోన్, ఒక క్వాడ్ రియర్ కెమేరా సెటప్పును మాత్రమేకాకుండా , Punch-Hole సూపర్ AMOLED డిస్ప్లే, 4500mAh భారీ బ్యాటరీ మరియు స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో ప్రీమియం ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 17 న ఫ్లిప్కార్ట్, అమేజాన్ మరియు vivo అధికారిక వెబ్సైట్ నుండి జరగనుంది.   

VIVO V17 : ధర

VIVO V17 -  8GB + 128GB - Rs.22,990

VIVO V17 : ప్రత్యేకతలు

ఈ వివో V17 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.44 అంగుళాల పంచ్ - హోల్ డిస్ప్లేతో అందించబడుతుంది మరియు ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ ఫోన్ పూర్తిగా 91.8 % స్క్రీన్-టు-బాడీ రేషియోని కలిగివుంటుంది. అంతేకాకుండా, ప్రపంచంలో మొట్టమొదటి సారిగా కేవలం 2.9mm పరిమాణంతో పంచ్ హోల్ సెల్ఫీ తో వచ్చిన ఫోనుగా నిలుస్తుంది. అధనంగా, ఇందులో అందించిన డిస్ప్లే E3 Super AMOLED డిస్ప్లే కావడం వలన ఇది అత్యధికంగా 800 Nits వరకూ బ్రైట్నెస్ అందిస్తుంది.

ఇది ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు క్వాడ్ రియర్ కెమేరాకు చక్కగా అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై  పైన ఆధారితంగా సరికొత్త Funtouch OS 9.2 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ ఇంజన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి గల ఒక 4500 mAh బ్యాటరీతో మరియు టైప్ -C పోర్టుతో వస్తుంది. అయితే, ఇది 8GB ర్యామ్ జతగా 128GB  వేరియంటుతో మాత్రమే వస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP+8MP+2MP+2MP  క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమరా ఒక f/1.8 అపర్చరుతో  ఉంటుంది. ఇంకా 2MP కెమేరా పోర్ట్రైట్ ఫోకస్ కోసం మరియు 8MP కెమేరా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం మరియు 2MP మాక్రో షాట్ల కోసం  ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన వెనుక కెమెరాతో  స్లొమాషన్ వీడియోలను, అదీకూడా 240fps వద్ద తీసుకోవచ్చు. ఈ ఫోన్ బాక్స్ లో మీకు ఒక ఖరీదైన  ఇయర్ ఫోన్ కూడా లభిస్తుంది.         

logo
Raja Pullagura

వివో V17

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.