డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో ఎంట్రీ ఇచ్చిన VIVO V 17 PRO స్మార్ట్ ఫోన్

డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో ఎంట్రీ ఇచ్చిన VIVO V 17 PRO స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

వివో వి 17 ప్రో స్నాప్‌డ్రాగన్ 675 SoC యొక్క శక్తితో నడుస్తుంది.

భారతదేశంలో వివో తన కొత్త స్మార్ట్‌ ఫోన్ అయినటువంటి, Vivo V 17 Pro ను విడుదల చేసింది, దీని కెమెరా కారణంగా ఇది ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందింది. వివో యొక్క తాజా ఫోన్ ఒక డ్యూయల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వచ్చింది, ఇది 32 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది మరియు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. వివో వి 17 ప్రో స్నాప్‌డ్రాగన్ 675 SoC యొక్క శక్తితో నడుస్తుంది.

భారతదేశంలో వివో వి 17 ప్రో ధర

వివో వి 17 ప్రో యొక్క 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .29,990 మరియు డివైస్ మిడ్నైట్ ఓషన్ మరియు గ్లేషియర్ ఐస్ కలర్ ఆప్షన్లలో విడుదల చేయబడింది. ఈ స్మార్ట్‌ ఫోన్ను ప్రీ-ఆర్డర్‌ కోసం అందించగా, ఈ ఫోన్ యొక్క మొదటి అమ్మకం సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ను వివో ఈషాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ మరియు టాటా క్లిక్ ద్వారా విక్రయించనున్నారు.

వివో వి 17 ప్రో స్పెసిఫికేషన్స్

ఈ వివో వి 17 ప్రో ఆండ్రాయిడ్ 9 పై పనిచేసే ఫన్ టౌచ్ ఓఎస్ 9.1 పై పనిచేస్తుంది మరియు డ్యూయల్-సిమ్  ని అనుసంధానం చేసుకోవచ్చు . ఈ స్మార్ట్‌ఫోన్ ఒక 6.44-అంగుళాల పూర్తి HD + (1080 x 2400 పిక్సెల్స్) అల్ట్రా ఫుల్‌వ్యూ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ను ఒక 20: 9 యాస్పెక్ట్ రేషియోతో మరియు 91.65 స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్‌లో కార్నింగ్ గ్లాస్ 6 యొక్క రక్షణ ఇవ్వబడింది.

వివో వి 17 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC యొక్క శక్తితో నడుస్తుంది మరియు దీనికి జతగా ఒక 8GB RAM మరియు 128GB స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా అందించబడింది, ఇది 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాను కలిగి ఉంది మరియు ఇది సోనీ IMX582 సెన్సార్ మరియు దాని ఎపర్చరు f / 1.8 తో ఉంటుంది. ఇక రెండవ కెమెరా 13-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మరియు ఎపర్చరు f / 2.5 కలిగి ఉంది, ఇది 2x ఆప్టికల్ జూమ్ మరియు 10x హైబ్రిడ్ జూమ్ మద్దతుతో వస్తుంది. ఇది కాకుండా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఒక ఎపర్చరు f / 2.2 కలిగి ఉంది మరియు 2 మెగాపిక్సెల్ బోకె కెమెరాతో తీసుకురాబడింది.

ఈ ఫోన్ ముందు భాగంలో 32 + 8 మెగాపిక్సెల్ డ్యూయల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంది. వివో వి 17 ప్రో ఫోటోగ్రఫీ కోసం సూపర్ నైట్ సెల్ఫీ ఫీచర్‌తో తీసుకురాబడింది. అదనంగా, ఈ ఫోన్ యొక్క డిస్ప్లే లో ఒక వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది.

కనెక్టివిటీ కోసం, పరికరంలో 4 జి LTE, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జిపిఎస్, గ్లోనాస్ మరియు బీడు ఎంపికలు ఉన్నాయి. ఇక ఇది ఒక 4,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది మరియు ఇది 18W డ్యూయల్ ఇంజన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. వివో వి 17 ప్రో యొక్క కొలత 159 x 74.70 x 9.8 మిమీ మరియు దీని బరువు 201.8 గ్రాములు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo