Samsung Galaxy M17e 5G: బడ్జెట్ యూజర్ ని ఆకర్షించే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Samsung Galaxy M17e 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది
శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ యూజర్ ని ఆకర్షించే ఫీచర్స్ తో విడుదల చేసింది
One UI 8.0 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 16 OS తో ఈ ఫోన్ రిలీజ్ అయ్యింది
Samsung Galaxy M17e 5G: స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ యూజర్ ని ఆకర్షించే ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు మీడియాటెక్ బడ్జెట్ ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టింది. ఈ ఫోన్ పూర్తి స్పెక్స్ మరియు ఫీచర్స్ తో పాటు ఈ ఫోన్ ప్రైస్ వివరాలు తెలుసుకోండి.
SurveySamsung Galaxy M17e 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్
శాంసంగ్ గెలాక్సీ M17e స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది. ఈ ఫోన్ పై రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది. ఈ ఫోన్ బ్లిట్జ్ బ్లూ మరియు వైబ్ వయోలెట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
Samsung Galaxy M17e 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ M17e స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, గొప్ప బ్రైట్నెస్ మరియు అడాప్టివ్ బ్రైట్నెస్ ఫీచర్ తో వస్తుంది. డిజైన్ పరంగా, ఈ ఫోన్ 8.2mm సైజుతో స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఈ శామ్సంగ్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. శామ్సంగ్ యొక్క సరికొత్త One UI 8.0 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 16 OS తో ఈ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఈ ఫోన్ 6 జెనరేషన్ OS అప్ గ్రేడ్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP + 2MP కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాని శామ్సంగ్ అందించింది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సర్కిల్ టు సెర్చ్, AI కెమెరా ఫీచర్స్ మరియు బెస్ట్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 50 ఇంచ్ 4K Smart Tv ని కేవలం 21 వేల బడ్జెట్ లోనే అందుకోండి.!
ఈ ఫోన్ ఆటో బ్లాకర్ మరియు Samsung Knox ఫీచర్ తో వస్తుంది. అంటే, ఈ ఫోన్ మంచి సెక్యూరిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో సేడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అదనంగా, కాలింగ్ కోసం ఈ ఫోన్ లో వాయిస్ ఫోకస్ ఫీచర్ ను కూడా శామ్సంగ్ అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile