Vivo T5 Pro 5G: ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ లో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వివో టి సిరీస్ నుంచి ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ టి 5 ప్రో ని విడుదల చేసింది

ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసింది

ఈ ఫోన్ 9020 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యింది

Vivo T5 Pro 5G: ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ లో లాంచ్ అయ్యింది.!

Vivo T5 Pro 5G: వివో టి సిరీస్ నుంచి ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ టి 5 ప్రో ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ను ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని 9020 mAh బ్యాటరీ మరియు Snapdragon 7 Gen 4 చిప్ సెట్ వరకు చాలా విభాగాల్లో ప్రీమియం ఫీచర్స్ తో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5 Pro 5G: ప్రైస్

ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ కలర్ వేరియంట్

  • వివో టి 5 ప్రో (8GB + 128GB) ప్రైస్ : రూ. 29,999
  • వివో టి 5 ప్రో (8GB + 256GB) ప్రైస్ : రూ. 33,999
  • వివో టి 5 ప్రో (12GB + 256GB) ప్రైస్ : రూ. 33,999

ఈ స్మార్ట్ ఫోన్ గ్లేషియర్ బ్లూ మరియు కాస్మిక్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది.

Vivo T5 Pro 5G price and offers

సేల్ అండ్ ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ పై రెండు బిగ్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఒకటి రూ. 3,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రెండోది రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. వేరియంట్ ను బట్టి ఈ ఆఫర్ అమౌంట్ మారుతుంది. HDFC, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ వివో ఫోన్ కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, పైన తెలిపిన రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే లభిస్తుంది.

Also Read: BSNL Budget Plan: కేవలం రూ. 200 ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Vivo T5 Pro 5G: ఫీచర్స్

వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ 8.25mm మందంతో కొంచెం మందంగా ఉన్నా ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీతో పోలిస్తే మంచి స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు చూడొచ్చు. ఈ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది 1.2 Mn+ AnTuTu స్కోర్ అందించే ఫాస్ట్ చిప్ సెట్. దానికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Vivo T5 Pro 5G features

ఈ ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగి సెల్ఫీ మరియు మెయిన్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన వివో కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 9020 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఇందులో 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో అందించింది. కూలింగ్ కోసం ఈ ఫోన్ లో పెద్ద VC కూలింగ్ సిస్టం కూడా ఉంది. ఇది మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మరియు IP68 అండ్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 120FPS గేమింగ్ అందించే డిస్ప్లే , మంచి కూలింగ్ సిస్టం, అతి భారీ బ్యాటరీ, వేగవంతమైన పెర్ఫార్మెన్స్ అందించే బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టిందని ఈ ఫోన్ గురించి చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo