Vivo T5 Lite top 5 features and expect price know one day before launch
Vivo T5 Lite: వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో టి5 లైట్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ ను కంపెనీ ముందే రివీల్ చేసింది. ఈ ఫోన్ భారీ బ్యాటరీ, గొప్ప డిజైన్ మరియు జబర్దస్త్ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. రేపు లాంచ్ కాబోతున్న వివో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి. ఆంతేకాదు, ఈ ఫోన్ అంచనా ప్రైస్ ను కూడా ఒకసారి పరిశీలిద్దాం.
వివో టి 5 లైట్ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ యాంటీ డ్రాప్ సర్టిఫికేషన్ కలిగిన దృఢమైన డిజైన్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది MIL-STD 810 H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP65 వాటర్ అదనపు డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
ఈ వివో ఫోన్ లేటెస్ట్ ఫోన్ TUV Rheinland ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కలిగిన కలిగిన 6.74 ఇంచ్ బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో బ్రైటెస్ట్ డిస్ప్లే కలిగిన ఫోన్ ఇట్టి అవుతుందని వివో తెలిపింది.
ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది మరియు ఇది లేటెస్ట్ AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
ఈ వివో కొత్త ఫోన్ 6500 mAh బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ తో ఈ ఫోన్ 48 గంటల వీడియో ప్లే బ్యాక్ లేదా 80 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ లేదా 12 గంటల గేమ్ ప్లే లేదా 54 గంటల కంటే అధిక సమయం వాయిస్ కాల్ బ్యాకప్ అందిస్తుందని వివో పేర్కొంది.
వివో ఈ ఫోన్ ను ఫోన్ ను వేవ్ బ్లూ మరియు ట్విలైట్ షాడో రెండు కలర్ ఎంపికలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Color OS సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో లాంచ్ అవుతుంది.
Also Read: iPhone 18 Release Date ఎప్పుడు అంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.!
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 12,999 నుంచి రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.