Vivo T5 Lite launch date display and some key specs released
Vivo T5 Lite : వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ వివరాలు వెల్లడించిన కంపెనీ ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా ఒకొక్కటిగా రిలీజ్ చేస్తోంది. వివో ఈ అప్ కమింగ్ ఫోన్ సెగ్మెంట్ బ్రైట్ డిస్ప్లే మరియు టర్బో బ్యాటరీతో లాంచ్ అవుతుందని వివో తెలిపింది. ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ కూడా వివో విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ వివో ఫోన్ టీజర్ స్పెక్స్ మరియు లీక్డ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
వివో టి5 లైట్ స్మార్ట్ ఫోన్ జూలై 16వ తేదీ 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టర్బో ఫీచర్స్ టోడ్ లాంచ్ అవుతుందని వివో తెలిపింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ మరియు కీలక ఫీచర్స్ కూడా వివో వెల్లడించింది.
వివో ఈరోజు టి5 లైట్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే విప్ వివరాలు ఈరోజు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను సెగ్మెంట్ బ్రైటెస్ట్ డిస్ప్లే తో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది. ఈ డిస్ప్లే వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో TUV Rheinland ఐ ప్రొటెక్షన్ సపోర్ట్ కలిగిన 6.74 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది చాలా స్లీక్ బెజెల్స్ తో ఎక్కువ స్క్రీన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 8.39mm మందంతో ఉంటుంది మరియు ఈ సైజులో 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఛార్జ్ సపోర్ట్ తో కేవలం 38 నిముషాల్లో ఈ ఫోన్ 1 – 50% ఛార్జ్ అవుతుందని వివో తెలిపింది. ఈ ఫోన్ ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ కెమెరాతో జతగాLED ఫ్లాష్ లైట్ మరియు నోటిఫికేషన్ కోసం ప్రత్యేమైన లైట్ కూడా ఉంటుంది.
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలర్ వేరియెంట్ వివరాలు కూడా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను వేవ్ బ్లూ మరియు ట్విలైట్ షాడో అనే రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఓవరాల్ ఫీచర్ తో లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ ఈ ఫోన్ గురించి వివరాలు వెల్లడించింది.
Also Read: Amazon మరియు Flipkart లో నకిలీ OnePlus TWS ఇయర్ బడ్స్ అమ్మతున్నారా.. నిజం తెలుసుకోండి.!
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో రాబోయే ఫోన్ అని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. వాస్తవానికి కూడా వివి టి సిరీస్ నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ ఫోన్ లను అందించింది. కాబట్టి, లీక్స్ మరియు మార్కెట్ వర్గాలు చెబుతున్న మాటలు మనం కొంత వరకు నమ్మడానికి అవకాశం ఉంది.