Amazon మరియు Flipkart లో నకిలీ OnePlus TWS ఇయర్ బడ్స్ అమ్ముతున్నారా.. నిజం తెలుసుకోండి.!
Amazon మరియు Flipkart ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అధికమవుతోంది
OnePlus TWS ఇయర్ బడ్స్ కు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు అందాయని ఫిర్యాదులు
ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే ముందుగా యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ ట్వీట్ లో తెలిపారు
రోజురోజుకూ ఆన్‌లైన్ షాపింగ్ మరింత పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లైన Amazon మరియు Flipkart ద్వారా స్మార్ట్ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. అయితే, ఇటీవల సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఫోమ్స్ లలో కొంతమంది వినియోగదారులు OnePlus TWS ఇయర్‌బడ్స్‌కు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు అందాయని ఫిర్యాదులు చేశారు. దీంతో కొనుగోలుదారుల్లో సందేహాలు నెలకొన్నాయి. అందుకే, ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
SurveyAmazon మరియు Flipkart లో నకిలీ OnePlus TWS ఇయర్ బడ్స్ అమ్మతున్నారా?
వాస్తవానికి, ఈ విషయం పై చాలా కాలం నుంచి చర్చ నడుస్తున్నా, రీసెంట్ గా X ప్లాట్ ఫామ్ నుంచి Ahsankarbhai అకౌంట్ నుంచి షేర్ చేసిన ఒక ట్వీట్ తర్వాత ఈ విషయం మరింత వేడెక్కింది. ఈ ట్వీట్ ప్రకారం, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో నకిలీ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ సేల్ అవుతున్నాయని మరియు ఈ విషయం పై వన్ ప్లస్ జోక్యం చేసుకోవాలని తెలిపారు. అంతేకాదు, ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే ముందుగా యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ ట్వీట్ లో తెలిపారు.
🚨 Be Alert!! Fake TWS on E-commerce Websites
— Ahsan (@AhsanKharbai) July 12, 2026
Fake copies of OnePlus TWS earbuds are being sold openly on Amazon & Flipkart.
OnePlus needs to take cognizance of this issue, as innocent buyers could lose their hard-earned money while the brand's reputation also takes a hit.… pic.twitter.com/fVa1atdnke
Amazon మరియు Flipkart లో నకిలీ OnePlus TWS ఇయర్ బడ్స్ అమ్మతున్నారా? అనే దానికి సింపుల్ సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. అయితే, ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం. ప్రస్తుతం అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ అధికారికంగా నకిలీ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ ను విక్రయిస్తున్నాయనే ఆధారాలు లేవు. ఈ రెండు సంస్థలు మార్కెట్ ప్లేస్ మోడల్ లో పనిచేస్తాయి.
అంటే, వీటిలో అధికారిక బ్రాండ్ స్టోర్ తో పాటు అనేక థర్డ్ పార్టీ విక్రేతలు కూడా ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి థర్డ్ పార్టీ సెల్లర్స్ ద్వారా నకిలీ లేదా అసలైన ప్రోడక్ట్ మాదిరిగా కనిపించే నకిలీ వస్తువులు వినియోగదారులకు చేరిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వన్ ప్లస్ సర్వీస్ సెంటర్లు కూడా ఆ ప్రొడక్ట్స్ అసలైన వాటిగా గుర్తించలేదని వినియోగదారులు పేర్కొన్నారు. అంటే, నకిలీ ప్రోడక్ట్ అని చెప్పకనే చెప్పారు.
Also Read: భారీ ఆఫర్స్ తో MOTOROLA G77 Power ఫస్ట్ సేల్ ఈరోజే మొదలయ్యేది .!
ఇలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి?
ఇలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి? అని మీరు యోచనలో పడేవుంటారు. అందుకే, వన్ ప్లస్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ముందుగా, వన్ ప్లస్ అధికారిక స్టోర్ లేదా అధీకృత విక్రేత నుంచి కొనుగోలు చేయడం మంచిది. ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసే ముందు విక్రేత (సెల్లర్) రేటింగ్, కస్టమర్ రివ్యూలు, రిటర్న్ పాలసీ వంటి వివరాలను పరిశీలించాలి. ప్రోడక్ట్ అందుకున్న తర్వాత ప్యాకేజింగ్, సీల్, సీరియల్ నంబర్, IMEI లేదా ఇతర ధృవీకరణ వివరాలను కూడా తరావుగా పరిశీలించాలి. అంతేకాదు, వారంటీ కూడా సక్రమంగా అమలవుతుందో లేదో కూడా మీరు నిర్ధారించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీరు నకిలీ ప్రోడక్ట్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

వాస్తవానికి, కేవలం వన్ ప్లస్ బడ్స్ మాత్రమే కాదు ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు మీరు ఆ వస్తువులు అధికారిక సెల్లర్ నుంచి కొనుగోలు చేస్తున్నామో లేదో చెక్ చేయాలి. ఎందుకంటే, ప్రస్తుతం మార్కెట్ లో అసలు కంటే నకిలీ వస్తవులే ఎక్కువగా చలామణి అవుతున్నాయి. కంపెనీ ప్రకటించిన రేటు కంటే చవక ధరలో లభిస్తుందని కొనుగోలు చేస్తే, తర్వాత మొదటికే మోసం వస్తుంది. కాబట్టి, కొనుగోలుదారులు ఆన్లైన్ సైట్స్ లో వస్తవులు కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
