Vivo T5 Lite just launched in India and know the price nad compete features
Vivo T5 Lite: వివో ఈరోజు టి సిరీస్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో T5 లైట్ ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను భారీ బ్యాటరీ, దృఢమైన డిజైన్ మరియు బ్రైట్ డిస్ప్లే వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ తో పాటు ఫస్ట్ సేల్ కోసం ప్రత్యేకమైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వివో జత చేసింది. వివో జస్ట్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ చూద్దామా.
వివో టి5 లైట్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్ లో వివో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ ఇలా ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ ట్విలైట్ షాడో మరియు వేవ్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ జూలై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం వివో కేవలం 12 గంటలు అందుబాటులో ఉండేలా బీహార్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను డిస్కౌంట్ ప్రైస్ లో పొందొచ్చు.
పైన తెలిపిన విధంగా ఈ స్మార్ట్ ఫోన్ పై బిగ్ ఫస్ట్ డే సేల్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై HDFC, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ ఆప్షన్ తో రూ. 1,500 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను పైన తెలిపిన మూడు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఈ ఫోన్ రూ. 18,499 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది.
Also Read: OnePlus N6x: వన్ ప్లస్ N సిరీస్ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్.!
వివో T5 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ను రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అనిపిస్తుంది. ఇందులో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇది డైలీ పనులు, మల్టీ టాస్కింగ్ మరియు 5G కనెక్టివిటీ కోసం మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 4GB/6GB ర్యామ్ మరియు 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది.
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరాతో జతగా సహాయక కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు సెల్ఫీస్ అండ్ వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీ రోజంతా సులభంగా ఉపయోగించుకునేంత బ్యాకప్ ను అందిస్తుంది. అలాగే, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ తో తక్కువ సమయంలోనే బ్యాటరీ చాలా వేగంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటంతో రోజువారీ ఉపయోగంలో మరింత అదనపు రక్షణ లభిస్తుంది.