OnePlus N6x: వన్ ప్లస్ N సిరీస్ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్.!
మార్కెట్లో కొత్తగా N సిరీస్ ని పరిచయం చేసిన వన్ ప్లస్
OnePlus N6x అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
మరింత బడ్జెట్ ఫోన్ గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాల అంచనా
OnePlus N6x: రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో కొత్తగా N సిరీస్ ని పరిచయం చేసిన వన్ ప్లస్, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ N6x పేరుతో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ టీజర్ విడుదల చేసింది. మరి వన్ ప్లస్ విడుదల చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.
SurveyOnePlus N6x: లాంచ్ డేట్
వన్ ప్లస్ విడుదల చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేయడం మొదలు పెట్టింది.
OnePlus N6x: విశేషాలు
వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ ఎటువంటి టీజర్ వివరాలు ఇంకా అందించలేదు. అయితే, గత నెల చివరిలో వన్ ప్లస్ ఎన్ సిరీస్ నుంచి విడుదల చేసిన మొదటి ఫోన్ వన్ ప్లస్ ఎన్ 6 మంచి ఫలితాలను అందించడంతో, కంపెనీ ఇదే సిరీస్ నుంచి ఈ ఫోన్ కంటే మరింత బడ్జెట్ ఫోన్ గా వన్ ప్లస్ ఎన్ 6x ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్దమయ్యిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే కనుక నిజం అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క డౌన్ టోన్ వెర్షన్ గా వన్ ప్లస్ ఎన్ 6x ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్ ప్లస్ ఎన్ 6 కేవలం రూ. 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో భారీ 800 mAh బ్యాటరీ మరియు Dimensity 6360 Apex చిప్ సెట్ వంటి ఫీచర్స్ తో మార్కెట్లో ప్రవేశించింది. ఇది మంచి అమ్మకాలను సాధించినట్లు కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: IRCTC New Beta Website తో టికెట్ బుకింగ్ మరింత వేగంగా మరియు సులభంగా మార్చిన రైల్వే శాఖ.!
ఇప్పుడు అదే బాటలో ఈ ఫోన్ ను మరింత బడ్జెట్ ఫోన్ గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కంపెనీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకా ఎటువంటి అఫీషియల్ వివరాలు వెల్లడించలేదు. కానీ, నెట్టింట్లో ఈ ఫోన్ కీలక స్పెక్స్ రూమర్లు మరియు లీక్ లు సర్క్యులేట్ అవుతున్నాయి.
రూమర్లు మరియు లీక్స్
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోడోత్ ఎన్ 6 మాదిరిగా పెద్ద స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని రూమర్లు చెబుతున్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 6300 తో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. ఇదే కాదు ఇందులో కొద బిగ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ మరియు ఆకట్టుకునే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉడొంచని లీక్స్ పేర్కొంటున్నాయి.
వన్ ప్లస్ ఈ ఫోన్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ అఫీషియల్ గా వెల్లడించిన తర్వాత ఈ లీక్స్ మరియు రూమర్స్ లో ఎన్ని నిజం అవుతాయో తెలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile