Vivo T5 స్మార్ట్ ఫోన్ ఈ టాప్ 5 టర్బో ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Vivo T5 స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో మార్కెట్లో లాంచ్ అవుతుంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అఫీషియల్ కీలక ఫీచర్స్ రివీల్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ని 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేస్తోంది

Vivo T5 స్మార్ట్ ఫోన్ ఈ టాప్ 5 టర్బో ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

Vivo T5 స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో మార్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అఫీషియల్ కీలక ఫీచర్స్ రివీల్ కావడంతో, ఈ ఫోన్ పై చర్చ మొదలయ్యింది. ఈ ఫోన్ ను వేగవంతమైన చిప్ సెట్, బిగ్ బ్యాటరీ, పవర్ ఫుల్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అందుకే, ఈ ఫోన్ పైన అంచనాలతో కూడిన చర్చ కూడా మొదలయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5 : టాప్ 5 టర్బో ఫీచర్స్

ఇక వివో టి5 స్మార్ట్ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అందించిన డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ మరియు డ్యూరబిలిటీ గురించి చెప్పవచ్చు. ఈ టాప్ టర్బో ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

టర్బో డిస్ప్లే

ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే, వివో ఈ స్మార్ట్ ఫోన్ ని 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేస్తోంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, SGS 5 స్టార్ రేటింగ్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా తగిన విధంగా ఉంటుంది.

టర్బో డ్యూరబిలిటీ

ఈ స్మార్ట్ ఫోన్ ని మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో అందిస్తోంది. ఫోన్ అనుకోకుండా కిందపడినా కూడా తాకిడిని తట్టుకునేలా ఉంటుంది. అంతేకాదు, ఈ వివో స్మార్ట్ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది.

Vivo T5 top 5 features

టర్బో పెర్ఫార్మెన్స్

ఈ స్మార్ట్ ఫోన్ ను టర్బో పెర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్ మరియు ఇతర వివరాలతో లాంచ్ చేస్తున్నట్లు వివో వెల్లడించింది. అన్నట్లుగానే ఈ స్మార్ట్ ఫోన్ ని మీడియాటెక్ Dimensity 7500 ప్రాసెసర్ తో లాంచ్ చేస్తోంది. ఈ ప్రాసెసర్ 12 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ చిప్ సెట్ సమర్ధవంతమైన ఏఐ కంప్యూటింగ్ శక్తి కలిగి ఉంటుంది. ఇది ఫోన్ ను వేగంగా ఉంచడమే కాకుండా గొప్ప ఏఐ శక్తిని కూడా ఈ ఫోన్ కి ఆపాదిస్తుంది.

Also Read: Poco X8: న్యూ లుక్ అండ్ న్యూ ఫీచర్స్ తో వస్తున్న పోకో న్యూ ఫోన్.!

టర్బో కెమెరా

ఈ ఫోన్ లో టర్బో కెమెరాని వివో అందించింది. ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 882 మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాలు 4K వీడియో సపోర్ట్, మల్టీ ఫోకల్ పోర్ట్రైట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

టర్బో బ్యాటరీ

ఈ ఫోన్ ను చాలా స్లిమ్ డిజైన్ లో భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది. ఇది 7050 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ ఫీచర్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile