Poco X8: న్యూ లుక్ అండ్ న్యూ ఫీచర్స్ తో వస్తున్న పోకో న్యూ ఫోన్.!
Poco X8 ఫోన్ న్యూ లుక్ అండ్ న్యూ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది
ప్రీమియం లుక్స్ కలిగిన సరికొత్త డిజైన్ లో లాంచ్ చేస్తోంది
HDR 10+ సపోర్ట్ మరియు Dolby Vision వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా అందించింది
Poco X8: పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం చేపట్టిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ఫీచర్స్ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ న్యూ లుక్ అండ్ న్యూ ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు భారీగా టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా పోకో కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyPoco X8: లాంచ్ డేట్
పోకో ఎక్స్ 8 స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 4న ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ x ప్లాట్ ఫామ్ ద్వారా టీజింగ్ చేయబడుతోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్స్ విడుదల చేసింది.
Poco X8: కీలక ఫీచర్స్
పోకో ఎక్స్ 8 స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం లుక్స్ కలిగిన సరికొత్త డిజైన్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్ మరియు మెటల్ కెమెరా బంప్ కలిగి ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే అనిపిస్తుంది. అయితే, ఈ ఫీచర్ పై పోకో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోన్ రౌండ్ కార్నర్స్ మరియు స్లీక్ డిజైన్ తో ఆకట్టుకునే రూపంలో ఉంటుంది.
డిస్ప్లే పరంగా, ఈ ఫోన్ లో బిగ్ అండ్ అందించింది. ఇందులో 6.83 ఇంచ్ పరిమాణం కలిగిన పెద్ద 12 బిట్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు వెట్ టచ్ డిస్ప్లే 2.0 ఫీచర్ తో ఉంటుంది.

ఇవి కాకుండా ఈ ఫోన్ లో HDR 10+ సపోర్ట్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ వంటి ప్రీమియం డిస్ప్లే ఫీచర్స్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ లెవల్ విజువల్స్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. అంత ప్రీమియం డిస్ప్లే కోసం రక్షణ ఇచ్చే గ్లాస్ కూడా ప్రీమియం గానే ఉండాలి కదా. అందుకే, ఈ ఫోన్ స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో అందించింది. ఈ ఫోన్ 3 మీటర్ డ్రాప్ టెస్ట్ లో SGS 5 స్టార్ సర్టిఫికేషన్ అందుకున్నట్లు కూడా పోకో తెలిపింది.
Also Read: మార్కెట్లో దిగిన కొత్త బడ్జెట్ ఫోన్ BOLTT ACE 5G ఫస్ట్ సేల్ డేట్ వచ్చేసింది.!
ఈ ఫోన్ ను 6 కంటే ఎక్కువ సంవత్సరాల బ్యాటరీ హెల్త్ కలిగిన 9000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో లాంచ్ చేస్తోంది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
