vivo T5 5G First Sale offers and phone details know one day before sale
vivo T5 5G First Sale రేపు మధ్యాహ్నం మొదలవుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం వివో చాలా గొప్ప లాంచ్ ఆఫర్స్ అందించింది. మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ పై అందించిన బిగ్ డీల్స్ తో చాలా చవక ధరలో అందుకునే అవకాశం వివో ఆఫర్ చేసింది. అందుకే, ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం అందించిన ఈ ఆఫర్ వివరాలు అందించాము. మరి ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తో పాటు ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా చూద్దాం.
వివో ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల Axis, HDFC మరియు SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో కొనే వారికి ఈ ఫోన్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పై 6 నెలల No cost EMI ఆఫర్ కూడా జత చేసింది. అంటే, ఎటువంటి వడ్డీ లేకుండా ఈ ఫోన్ ను EMI లో మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్ ప్రైస్ మరియు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆఫర్ తో ఈ ఫోన్ లభించే ఆఫర్ ప్రైస్ కూడా ఇప్పుడు చూద్దాం. వివో రూ. 34,999 రూపాయల ధరతో ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ని విడుదల చేసింది. అయితే, ఫస్ట్ డే బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 30,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
అలాగే, రూ. 39,999 రూపాయల ధరలో విడుదలైన ఈ ఫోన్ రెండో 8GB + 128GB వేరియంట్ ని రూ. 35,999 ధరలో మరియు రూ. 44,999 ధరలో లాంచ్ చేసిన 8GB + 256GB హై ఎండ్ వేరియంట్ ని రూ. 40,999 ధరలో అందుకోవచ్చు.
ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 9వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ను మీరు ఫ్లిప్ కార్ట్, వివో అఫీషియల్ సైట్ మరియు మీ ధరలోని రిటైల్ స్టోర్ నుంచి కూడా లభిస్తుంది.
Also Read: రూ. 20,000 కంటే తక్కువ రేటుకే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
వివో ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో గొప్ప స్లీక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అయితే, ఇంట సన్నని డిజైన్ లో కూడా చాలా పెద్ద 7050 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 44W ఫాస్ట్ వ్హార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ లో ఇది చాలా అధిక బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే కలిగిన ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.83 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ ఫోన్ స్క్రీన్ గొప్ప 1.5K రిజల్యూషన్, 2000 నిట్స్ 1పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7500 Turbo ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు గరిష్టంగా 1.2 మిలియన్ AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా అందించింది. ఇందులో 4K వీడియో రిక్డాంగ్ సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. ఇది గొప్ప ఫోటో ఫీచర్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ తో వస్తుంది.