vivo T5 5G First Sale నుంచి బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తున్న వివో.. ప్రైస్ అండ్ ఆఫర్స్ చూద్దామా.!
vivo T5 5G First Sale రేపు మధ్యాహ్నం మొదలవుతుంది
ఈ లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం వివో చాలా గొప్ప లాంచ్ ఆఫర్స్ అందించింది
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం అందించిన ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి
vivo T5 5G First Sale రేపు మధ్యాహ్నం మొదలవుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం వివో చాలా గొప్ప లాంచ్ ఆఫర్స్ అందించింది. మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ పై అందించిన బిగ్ డీల్స్ తో చాలా చవక ధరలో అందుకునే అవకాశం వివో ఆఫర్ చేసింది. అందుకే, ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం అందించిన ఈ ఆఫర్ వివరాలు అందించాము. మరి ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తో పాటు ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా చూద్దాం.
Surveyvivo T5 5G First Sale ఆఫర్స్
వివో ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల Axis, HDFC మరియు SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో కొనే వారికి ఈ ఫోన్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పై 6 నెలల No cost EMI ఆఫర్ కూడా జత చేసింది. అంటే, ఎటువంటి వడ్డీ లేకుండా ఈ ఫోన్ ను EMI లో మీ సొంతం చేసుకోవచ్చు.
vivo T5 5G: ప్రైస్
ఈ ఫోన్ ప్రైస్ మరియు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆఫర్ తో ఈ ఫోన్ లభించే ఆఫర్ ప్రైస్ కూడా ఇప్పుడు చూద్దాం. వివో రూ. 34,999 రూపాయల ధరతో ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ని విడుదల చేసింది. అయితే, ఫస్ట్ డే బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 30,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

అలాగే, రూ. 39,999 రూపాయల ధరలో విడుదలైన ఈ ఫోన్ రెండో 8GB + 128GB వేరియంట్ ని రూ. 35,999 ధరలో మరియు రూ. 44,999 ధరలో లాంచ్ చేసిన 8GB + 256GB హై ఎండ్ వేరియంట్ ని రూ. 40,999 ధరలో అందుకోవచ్చు.
ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 9వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ను మీరు ఫ్లిప్ కార్ట్, వివో అఫీషియల్ సైట్ మరియు మీ ధరలోని రిటైల్ స్టోర్ నుంచి కూడా లభిస్తుంది.
Also Read: రూ. 20,000 కంటే తక్కువ రేటుకే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
