Vivo T4x 5G : వివో కొత్త ఫోన్ వివో టి4x స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. ఈ ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో రేపు లాంచ్ అవుతుంది. రేపు విడుదల కానున్న ఈ వివో ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ధర వివరాలు ఈరోజే చూద్దాం.
Survey
✅ Thank you for completing the survey!
Vivo T4x 5G : ఫీచర్స్
వివో ఈ ఫోన్ ను 6500 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అన్నింటికంటే ముందు ఈ ఫీచర్ గురించే కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ పెద్ద బ్యాటరీని వేగవంతంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. విప్ టి4x 5జి స్మార్ట్ ఫోన్ ను వేగవంతమైన మీడియాటెక్ 5జి చిప్ సెట్ Dimensity 7300 తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ 7,28,000 లకు పైగా AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా వివో తెలిపింది.
ఈ ఫోన్ ను ప్రాంతో పర్పల్ మరియు మెరైన్ బ్లూ అనే రెండు రంగుల్లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తుంది. విప్ టి4x 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా వ్ వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ ను 6.67 ఇంచ్ FHD+ స్క్రీన్ తో కూడా అందించవచ్చు.
ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో కేవలం రూ. 12,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ రేవు లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ పై కప్పి ఉన్న అన్ని పరదాలు రేపటితో తొలగిపోతాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile