Vivo T4x 5G : బడ్జెట్ ధరలో విడుదలైన వివో బిగ్ బ్యాటరీ ఫోన్.!

HIGHLIGHTS

వివో బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ఈ రోజు మార్కెట్ లో విడుదలయ్యింది

Vivo T4x 5G ని బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది

చాలా 5జి స్మార్ట్ ఫోన్ లకు పోటీగా ఈ ఫోన్ వివో ప్రవేశపెట్టినట్లు అర్ధం అవుతుంది

Vivo T4x 5G : బడ్జెట్ ధరలో విడుదలైన వివో బిగ్ బ్యాటరీ ఫోన్.!

Vivo T4x 5G : వివో బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ఈ రోజు మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. అండర్ 15 వేల ధరలో ఇప్పటికే మార్కెట్ లో కొనసాగుతున్న చాలా 5జి స్మార్ట్ ఫోన్ లకు పోటీగా ఈ ఫోన్ వివో ప్రవేశపెట్టినట్లు అర్ధం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T4x 5G : ధర

వివో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో కేవలం రూ. 13,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ 6GB + 128GB ను రూ. 14,999 ధరతో మరియు ఈ ఫోన్ హై ఎండ్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 16,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ పై Axis, SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ మెరైన్ బ్లూ మరియు ప్రాంటో పర్పల్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ వివో స్టోర్స్, వివో వెబ్సైట్ మరియు Flipkart నుంచి లభిస్తుంది.

Also Read: Samsung Galaxy M16 5G: మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన లేటెస్ట్ ఫోన్ సేల్.!

Vivo T4x 5G : ఫీచర్స్

వివో టి4x 5జి స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ వివో కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో వస్తుంది మరియు 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

Vivo T4x 5G

ఈ ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ లో కెమెరాతో జతగా డైనమిక్ లైట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6500 mAh హెవీ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo